Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రాష్ట్ర విభజన, అమరావతి రాజధాని కేసులు విడివిడిగా విచారణ

సుప్రీంకోర్టు స్పష్టీకరణ
తదుపరి విచారణ 28కి వాయిదా

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్ర విభజన, అమరావతి రాజధాని కేసులను విడివిడిగానే విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ రెండు కేసులను వేర్వేరుగా విచారించాలని ప్రభుత్వం తరపున కోరామని, ఆ మేరకు సుప్రీం కోర్టు అంగీకరించిందని సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనుసింఫ్వీు, మాజీ ఏజీ వేణుగోపాల్‌ తెలిపారు. రాష్ట్ర విభజన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. అమరావతిపై 8, రాష్ట్ర విభజనపై 28 పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టులో అమరావతి రైతులు వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లను కేకే వేణుగోపాల్‌ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి మూడు రాజధానులు పెట్టే అధికారం లేదని, అమరావతే రాజధాని అని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ తీర్పుపై జగన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. అదే సమయంలో అమరావతి ప్రాంత రైతులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. వాటన్నింటినీ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ రెండు వాదనలపై ఇప్పటివరకు మొత్తం 36 పిటిషన్లు దాఖలయ్యాయి. రైతులు, ఇతర సంఘాల తరపున దాఖలైన పిటిషన్లన్నింటినీ ఒకటిగా చేర్చి విచారణ చేపట్టాలని గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించగా, తాజాగా దానిని పునఃసమీక్షించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే విడివిడిగా విచారణ చేపట్టాలనే నిర్ణయానికి వచ్చి సోమవారం జరగాల్సిన విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసినట్లు న్యాయవాదులు చెబుతున్నారు. దీనితో పాటు ఈ ఒక్కరోజే 30కి పైగా పెండిరగ్‌ కేసులను సుప్రీంకోర్టు విచారించడం, నిర్ణీత సమయానికి అమరావతి పిటిష న్లకు కేటాయించిన నంబర్‌ రాకపోవడం వల్ల విచా రణ వాయిదా పడినట్లు చెపుతున్నారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శివరామకృష్ణన్‌ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదిక, దీని తరువాత వైసీపీ ప్రభుత్వం వేసిన జీఎన్‌ రావు, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌, అత్యున్నతస్థాయి కమిటీ రూపొందించిన నివేదికల్లోని అంశాలను హైకోర్టు పట్టించుకోలేదని జగన్‌ ప్రభుత్వం వాది స్తోంది. రాజధాని నగరాలను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌.. వేర్వేరు సందర్భాల్లో లోక్‌సభ, రాజ్యసభల్లో చేసిన ప్రకటనలను దీనికి జోడిరచి సుప్రీంకోర్టుకు సమర్పించింది. రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న హైకోర్టు తీర్పును ప్రభుత్వ న్యాయవాది వైద్యనాథన్‌ చదివి వినిపించారు. అధికార వికేంద్రీకరణ జరగా లంటూ వివిధ సంఘాలు నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశాల సారాంశాన్ని క్లుప్తంగా సుప్రీంకోర్టుకు వివరించి, హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరనున్నట్లు న్యాయవాది వైద్యనాథన్‌ వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img