Friday, April 26, 2024
Friday, April 26, 2024

రైల్లో దారుణం.. తోటి ప్రయాణికుడికి నిప్పంటించిన దుండగుడు.. చిన్నారి, మహిళ సహా ముగ్గురు మృతి

రైల్లో ఇద్దరు ప్రయాణికుల మధ్య ఘర్షణ
ఆవేశంతో ఊగిపోతూ పెట్రోల్‌ పోసిన నిందితుడు
భయంతో రైలు నుంచి చిన్నారితో దూకేసిన మహిళ

కదులుతోన్న రైల్లో తోటి ప్రయాణికుడిపై ఓ దుండగుడు పెట్రోల్‌ పోసి, నిప్పంటించాడు. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. దారుణమైన ఈ ఘటన అలప్పుజ- కన్నూర్‌ ఎక్స్ప్రెస్‌ రైలులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. డీ1 కంపార్ట్మెంట్లో ఇద్దరు ప్రయాణికుల మధ్య మొదలైన గొడవ.. చినిచినికి గాలివానలా మారి చివరకు కోపంతో ఊగిపోయిన ఓ వ్యక్తి, తోటి ప్యాసింజర్పై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. అనంతరం చెయిన్లాగి, రైలు దిగి అక్కడి నుంచి పారిపోయాడు. రైలు కన్నూర్‌ చేరుకునేసరికి ప్రయాణికుల్లో ముగ్గురు మిస్సైనట్టు ప్యాసింజర్లు గ్రహించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే ట్రాక్లను పరిశీలించడం మొదలుపెట్టారు పోలీసులు. ఇంతలో వారికి మూడు మృతదేహాలు కనిపించాయి. మహిళ, మరో వ్యక్తి, ఏడాది చిన్నారి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలప్పుజ నుంచి బయలుదేరిన రైలు.. ఆదివారం రాత్రి 9.45 గంటలకు కోజికోడ్‌లోని ఎలత్తూరు సమీపంలో వంతెన వద్దకు చేరుకున్న సమయంలో ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడితో గొడవపడి అతడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడని పోలీసులు తెలిపారు. మంటలు చెలరేగి కనీసం ఎనిమిది మంది గాయపడ్డారని, నిందితుడు చైన్‌ లాగి రైలు నుంచి దూకి పరారయ్యాడని పేర్కొన్నారు. గాయపడిన వ్యక్తులను తోటి ప్రయాణికులు ఆస్పత్రికి తరలించారు. రైలు గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత తమ కోచ్‌లోని ఓ మహిళ సహా ముగ్గురు కనిపించకపోవడంతో తోటి ప్రయాణికులు పోలీసులకు తెలియజేశారు. ‘గాయపడిన వ్యక్తి ఓ మహిళ, చిన్నారి కోసం వెతుకుతూనే ఉన్నాడు.. మేము ఆ మహిళ పాదరక్షలు, మొబైల్‌ ఫోన్‌ను గుర్తించాం’ అని ఓ ప్రయాణికుడు తెలిపాడు. దీంతో పట్టాల వెంబడి ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లిన పోలీసులకు చిన్నారి, మహిళతో పాటు గుర్తుతెలియని ఓ మధ్యవయస్కుడి మృతదేహాలు కనిపించాయి. మంటలకు భయపడి రైలు నుంచి దూకేయడంతో వీరు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిప్పంటించిన దుండగుడ్ని సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించారు. అతడు ఇంతటి ఎందుకీ దారుణానికి పాల్పడ్డాడు? అనే విషయాలు తెలియరాలేదు.రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈఘటన స్థానికంగా కలకలం రేపింది. మొత్తం గాయపడిన 9 మందిని కోజికోడ్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రి సహా వివిధ హాస్పిటల్స్‌లో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img