Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

విద్వేష ప్రసంగం చేసినమోదీపై చర్యలు తీసుకోవాలి

ఎన్నికల సంఘానికి సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా లేఖ

న్యూదిల్లీ : ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తూ విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తగు చర్యలు తీసుకోవాలని సీపీఐ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈఓ) రాజీవ్‌కుమార్‌కు లేఖ రాశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్‌ 21న రాజస్థాన్‌లోని బన్స్వారాలో బహిరంగసభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం అత్యంత అభ్యంతరకరమన్నారు. ఆయన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని స్పష్టంగా ఉల్లంఘించాయి. ఆయన ముస్లింలను ఉద్దేశించి ‘మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి ఇవ్వాలా?’ అన్నారు. ప్రధాని ప్రసంగం అన్ని టీవీ ఛానళ్ల ద్వారా విస్తృతంగా ప్రసారం చేయబడిరది. అనేక వార్తాపత్రికలు ముద్రించాయని తెలిపారు. ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలను రాజా ప్రస్తావిస్తూ… ఆయన చేసిన వ్యాఖ్యలు చట్ట విరుద్ధమే కాక వివిధ వర్గాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఉద్రిక్తతల్ని ప్రేరేపించేలా ఉన్నాయని తెలిపారు. ఆయన హిందూ సమాజాన్ని, ముస్లిం సమాజాన్ని ప్రస్తావిస్తూ… ఉద్దేశపూర్వకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని వివరించారు. ఏదైనా నిర్దిష్ట మతాన్ని, వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడాన్ని ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని సెక్షన్‌ 123 (3)ని పూర్తిగా ఉల్లంఘించినట్లు ఈసీఐ అంగీకరించాల్సి ఉంటుందని రాజా స్పష్టం చేశారు. కాబట్టి ప్రధాని మోదీపై తక్షణమే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తిచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img