Friday, April 26, 2024
Friday, April 26, 2024

విశాఖ ఉక్కు జోలికొస్తే సహించం

. 3న జరిగే రాస్తారోకోను జయప్రదం చేయండి
. వామపక్ష నేతల విజ్ఞప్తి

విశాలాంధ్ర – విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, లేకపోతే ఆంధ్రుల ఆగ్రహానికి గురికాక తప్పదని వామపక్ష పార్టీల నేతలు హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి సంఫీుభావంగా మే 3వ తేదీన కార్మిక, ఉద్యోగ సంఘాలు చేపట్టిన రాష్ట్రవ్యాప్త రాస్తారోకోలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని కార్మికులకు సంఫీుభావం ప్రకటిస్తామన్నారు. విజయవాడ దాసరిభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ, సీపీఎంతో పాటు ఇతర వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడారు.
అఖిలపక్షాన్ని దిల్లీ తీసుకెళ్లాలి: రామకృష్ణ
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని 800 రోజులుగా కార్మికులు ఉద్యమం చేస్తుంటే ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్రం ముందుకెళ్లే ప్రయత్నం చేయటం సరికాదని రామకృష్ణ అన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించకుండా తాము బిడ్‌ వేస్తామని మోదీ పక్షమా? తేల్చుకోవాలన్నారు. విశాఖ ఉక్కును కాపాడుకోవటం కోసం సెయిల్‌ బిడ్‌లో పాల్గొనేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు పి.ప్రసాద్‌, ఎస్‌యూసీఐ(ఈసీ) నాయకులు కె.సుధీర్‌, ఫార్వర్డ్‌ బ్లాక్‌ నాయకులు పీవీ సుందర రామరాజు మాట్లాడారు. సీపీఐ(ఎంఎల్‌), ఎంసీపీఐ(యూ), సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img