Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సత్యపాల్‌ మాలిక్‌కు సీబీఐ సమన్లు

న్యూదిల్లీ: పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ అవినీతికి పాల్పడిరదన్న ఆరోపణలపై సాక్షిగా విచారించేందుకు జమ్ముకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. మాలిక్‌ 2018లో జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌గా ఉన్నప్పుడు కంపెనీ ఒప్పందాన్ని రద్దు చేశారు. కశ్మీర్‌ ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలకు వైద్య బీమా పథకాన్ని రూపొందించడంలో అవినీతి కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌తో పాటు ట్రినిటీ రీఇన్సూన్స్‌ బ్రోకర్లను నిందితులుగా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. బీమా పథకంలో అవకతవకలు జరిగాయని మాలిక్‌ ఆరోపించగా, ఆ తర్వాత సీబీఐ చర్య తీసుకుంది. దీనిపై మరింత సమాచారం రాబట్టాలని సీబీఐ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దాదాపు 3.5 లక్షల మంది ఉద్యోగులను కవర్‌ చేసే ఈ బీమా పథకం…సెప్టెంబర్‌ 2018లో రూపొందించారు. అయితే మాలిక్‌ దీనిని ఒక నెలలోనే రద్దు చేశారు. అవినీతి జరిగినట్లు గుర్తించినందున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతున్నారని, వివరాలను పరిశీలించిన తర్వాత తాను కూడా అదే నిర్ణయానికి వచ్చానని మాలిక్‌ ఆ సమయంలో చెప్పారు. ‘నేను స్వయంగా ఫైళ్లను పరిశీలించాను… కాంట్రాక్ట్‌ తప్పుగా ఇచ్చినట్లు నేను నిర్ధారణకు వచ్చాకనే దానిని రద్దు చేశాను’ అని మాలిక్‌ వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img