Friday, April 26, 2024
Friday, April 26, 2024

సామరస్యానికి భంగం కలిగించేవి విచారించం

బలవంతపు మతమార్పిళ్ల పిటిషన్‌ విచారణకు సుప్రీం తిరస్కృతి
న్యూదిల్లీ : బలవంతపు మతమార్పిడి వ్యవహారంలో మద్రాసు హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఇది ప్రచారసక్తితో దాఖలు చేసిందని వ్యాఖ్యానించింది. ఇటువంటివి సామరస్యానికి భంగం కలిగిస్తాయని జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ ఏఎస్‌ బొప్పన్న ధర్మాసనం పేర్కొంది. గతేడాది మార్చిలో క్రిస్టియన్‌ మిషనరీల కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు తమిళనాడుతో పాటు ఇతర చోట్ల బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిల్‌పై మద్రాసు హైకోర్టు మధురై బెంచ్‌ తీర్పును పిటిషనర్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన న్యాయస్థానం ప్రచారాసక్తితో చేసినందునే దీనిని కొట్టివేసేందుకు మూల్యం వసూలు చేస్తామని పేర్కొనగా పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతివ్వాలని ఫిర్యాది తరపు న్యాయవాది సీఆర్‌ జయా సుకిన్‌ కోరారు. దీంతో ప్రత్యేక సెలవు పిటిషన్‌ (ఎల్‌ఎల్‌పీ)ని ఉపసంహరించుకున్నట్లుగా పరిగణిస్తూ కొట్టేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img