Friday, April 26, 2024
Friday, April 26, 2024

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపండి

కేంద్రమంత్రి పరాస్‌కు విశాఖ ఉక్కు ఉద్యమనేతల వినతి

విశాలాంధ్ర` కూర్మన్నపాలెం (విశాఖ) :
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కేంద్రమంత్రి పశుపతి కుమార్‌ పరాస్‌కు ఉక్కు ఉద్యమ నాయకులు శనివారం దిల్లీలో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గాజువాక వైసీపీ ఇన్‌చార్జి తిప్పల దేవన్‌రెడ్డి, స్టీల్‌ప్లాంట్‌ కార్మికసంఘం నాయకులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. స్టీల్‌ప్లాంట్‌ కోసం చేసిన ప్రాణత్యాగాలు, ఉద్యమాలను మంత్రికి వివరించారు. ప్రైవేటీకరణతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల కుటుంబాలు నష్టపోతాయని తెలిపారు. ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ అయితే రిజర్వేషన్లు సైతం ఉండబోవని దేవన్‌రెడ్డి వివరించారు. దిల్లీలో జంతర్‌మంతర్‌ దగ్గర ఆగస్టు 2,3 తేదీల్లో జరిగే మహాధర్నాలో పాల్గొవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి పరాస్‌ను కలిసిన వారిలో వైసీపీ నాయకుడు బోగాది సన్నీ, స్టీల్‌ప్లాంట్‌ ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు మంత్రి రాజశేఖర్‌, సీహెచ్‌ నరసింగరావు, డి.ఆదినారాయణ, వరసాల శ్రీనివాస్‌, అంబేడ్కర్‌, గణపతిరెడ్డి ఉన్నారు.
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉక్కు పరిరక్షణ సమితి పేర్కొంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ప్లాంట్‌కు గనులు కేటాయించాలని డిమాండ్‌ చేసింది. శనివారం ఉక్కు పరిరక్షణ సమితి నేతలు దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రం కొత్త పరిశ్రమలు ఇవ్వకుండా..ఉన్న పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి మణిహారం లాంటి విశాఖ స్టీల్‌ను కాపాడుకోవాలని పేర్కొన్నారు. వేలకోట్ల రూపాయల విలువైన విశాఖ స్టీల్‌ను చౌకగా అమ్మేస్తున్నారని, దీనిపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపాలని విపక్షాలను కోరతామని చెప్పారు. ఆయా పార్టీల పార్లమెంటరీ పార్టీ నాయకులు స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమానికి మద్దతు పలికారని వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img