Friday, April 26, 2024
Friday, April 26, 2024

స్వర్ణభేరి

భారత్‌కు మరో బంగారం
వెయిట్‌ లిఫ్టింగ్‌లో అందరగొట్టిన జెరెమీ
రజతం గెలుచుకున్న బింద్యారాణి

బర్మింగ్‌హామ్‌: కామన్‌వెల్త్‌ క్రీడల్లో వెయిట్‌ లిఫ్టర్‌ జెరెమీ లాల్‌రిన్నుంగా దుమ్మురేపాడు. 67 కేజీల విభాగంలో ఈ 19 ఏళ్ల కుర్రాడు రికార్డు సృష్టిస్తూ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో మొదటి ప్రయత్నంలో 154 కేజీలు ఎత్తిన లిఫ్టర్‌.. రెండో ప్రయత్నంలో 160 కేజీలు ఎత్తాడు. దీంతో మొత్తంగా 300కేజీలకు పైగా ఎత్తి ఓవరాల్‌గా రికార్డు సృష్టించాడు.
మరో పతకం
కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ పతకాల ప్రయాణం కొనసాగుతోంది. వెయిట్‌లిఫ్టర్లు అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్నారు. వెయిట్‌ లిఫ్టింగ్‌ 55కిలోల విభాగంలో 23 ఏళ్ల బింద్యారాణి రజతం గెలుచుకుంది. స్నాచ్‌లో 86, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 116.. మొత్తం 202 కేజీల స్కోర్‌ చేసిన బింద్యారాణి.. భారత్‌కు నాలుగో పతకాన్ని సాధించి పెట్టింది. ఇప్పటికే మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణం, పురుషుల 55 కేజీల్లో సంకేత్‌ రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ పూజారి కాంస్యం నెగ్గారు. దీంతో పతకాల పట్టికలో భారత్‌ టాప్‌-10లో నిలిచింది. రజత పతకం సాధించిన వెయిట్‌ లిఫ్టర్‌ బింద్యారాణి దేవీకి ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌లో అభినందనలు తెలిపారు. ప్రధానితోపాటు అనేకమంది ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
సంకేత్‌కు రూ.30లక్షల రివార్డు
మరోవైపు, వెయిట్‌ లిఫ్టింగ్‌ 55 కిలోల విభాగంలో రజత పతకంతో మెరిసిన సంకేత్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నగదు రివార్డు ప్రకటించారు. సంకేత్‌కు రూ.30లక్షలు, ఆయన ట్రైనర్‌కు రూ.7లక్షల చొప్పున రివార్డుగా ఇవ్వనున్నట్టు సీఎంవో ఓ ప్రకటనలో వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img