Friday, April 26, 2024
Friday, April 26, 2024

1న కేంద్ర బడ్జెట్‌

న్యూదిల్లీ: 2023`24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 31 నుంచి మొదలవుతాయి. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ రోజు ప్రసంగిస్తారు. అదే రోజు ఆర్థిక సర్వేని కూడా ప్రవేశపెడతారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. ఫిబ్రవరి ఒకటో తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారని చెప్పారు. బడ్జెట్‌ సమావేశాలలో మొత్తం 27 సిట్టింగులు ఉంటాయి. రెండు విడతల్లో ఏప్రిల్‌ 6 వరకు బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయి. బడ్జెట్‌ పత్రాల పరిశీలనకు నెల సమయం ఉంటుందన్నారు. తొలివిడత ఫిబ్రవరి 14తో ముగుస్తాయని, రెండో విడత మార్చి 12 నుంచి జరుగుతుందని ప్రహ్లాద్‌ జోషి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img