Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

1.45 లక్షలకు పెరిగిన బ్యాంకు మోసం ఫిర్యాదులు

న్యూదిల్లీ: 2020-21 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు మోసాల ఫిర్యాదులు పెరిగాయి. వివిధ కేటగిరీల్లో వివిధ అంబుడ్స్‌మన్‌ పథకాల కింద ఆర్బీఐ నమోదు చేసిన మోసం ఫిర్యాదులు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1,45,309 (2019`20లో 1,35,448)కి పెరిగాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం రాజ్యసభకు తెలిపారు. ‘2019-20 నుంచి 2020-21 మధ్య కాలంలో ఏటీఎం/డెబిట్‌ కార్డ్‌లు, క్రెడిట్‌ కార్డ్‌లు, మొబైల్‌/ఎలక్ట్రానిక్‌ బ్యాంకింగ్‌లకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులను పోల్చి చూస్తే, ఏటీఎం/డెబిట్‌ కార్డుల ఫిర్యాదులకు సంబంధించి 13.01 శాతం క్షీణత నమోదైంది. ఇదే సమయంలో మొబైల్‌/ఎలక్ట్రానిక్‌ బ్యాంకింగ్‌ మరియు క్రెడిట్‌ కార్డ్‌లలో ఫిర్యాదులకు సంబంధించి వరుసగా 12.01 శాతం, 52.99 శాతం పెరుగుదల ఉంది’ అని ఆమె చెప్పారు. అనధికారిక ఎలక్ట్రానిక్‌ బ్యాంకింగ్‌ లావాదేవీల ద్వారా వినియోగదారులు మోసపూకుండా ఉండటానికి మార్గదర్శకాలను జారీ చేసిందని, ఇందులో అటువంటి ఫిర్యాదులను పరిష్కరించడానికి చర్యలు ఉన్నాయని సీతారామన్‌ వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img