Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

21 వేలు దాటిన రోజువారీ కరోనా కేసులు..లక్షన్నరకు చేరువైన బాధితులు

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గతకొన్ని రోజులుగా కరోనా బాధితుల సంఖ్య అధికమవుతుండటంతో రోజువారీ కేసులు 21 వేలు దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 21,566 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,38,25,185కు చేరాయి. ఇందులో 4,31,50,434 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,870 మంది మృతిచెందారు. మరో 1,48,881 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
ఇక బుధవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 45 మంది కరోనాతో మరణించగా, 18,294 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. రోజువారీ పాటిజివిటీ రేటు 4.25 శాతానికి చేరిందని తెలిపింది. అదేవిధంగా యాక్టివ్‌ కేసులు 0.33 శాతం, రికవరీ రేటు 98.47 శాతం, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నదని పేర్కొన్నది. ఇప్పటివరకు 200 కోట్ల 91 లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img