Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

2,3 తేదీల్లో చలో పార్లమెంటు

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్ణయం

విశాలాంధ్ర`కూర్మన్నపాలెం (విశాఖ) :విశాఖ ఉక్కు రక్షణ కోసం ఆగస్టు 2,3 తేదీల్లో తలపెట్టిన చలో పార్లమెంట్‌ను జయప్రదం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు అమ్మకాన్ని వేగవంతం చేసిన తరుణంలో సోమవారం ఉక్కు నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ సీహెచ్‌ నర్సింగ రావు, మంత్రి రాజశేఖర్‌, డి.ఆదినారాయణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు అమ్మకంలో భాగంగా ట్రాన్సాక్షన్‌ అడ్వైజర్‌, లీగల్‌ అడ్వైజర్‌ నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా టెండర్లు ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ రెండు ఉత్తరాలు రాశారని, అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి పంపారని గుర్తు చేశారు. గడిచిన పార్లమెంట్‌ సమావేశాల్లో ఎంపీలు నిరసన గళం విప్పినా కేంద్రం పట్టించుకోలేదని వివరించారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యక్ష ఆందోళన తప్ప మరోమార్గం లేదని స్పష్టం చేశారు. దీనిలో భాగమే ఆగస్టు 2,3 తేదీల్లో ఢల్లీిలో పార్లమెంట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌, కో కన్వీనర్‌ గంధం వెంకట్రావు, కె.సత్యనారాయణ రావు మాట్లాడుతూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుపై చేస్తున్న అన్యాయాన్ని పార్లమెంటరీ పక్ష నేతలకు వివరిస్తూ మద్దతు కోసం లేఖలు రాశామన్నారు. ఈనెల 20వ తారీఖున ప్రతినిధి బృందం ఢల్లీి చేరుకుని వారి మద్దతును సేకరిస్తామన్నారు. ఆంధ్రుడి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా కేంద్రం చర్యలు చేపడుతోందని తీవ్రంగా విమర్శించారు. సమావేశంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు వైటీ దాస్‌, జె సింహాచలం, మురళి రాజు, నీరుకొండ రామచంద్రరావు, మసేన్‌రావు, దొమ్మేటి అప్పారావు, వై.మస్తానప్ప, దాలినాయుడు, బొడ్డు పైడిరాజు, వరసాల శ్రీనివాస్‌, విళ్ళ రామోహన్‌ కుమార్‌, సిహెచ్‌ సన్యాసిరావు, డి సురేష్‌బాబు, కామేశ్వరరావు, అప్పలరాజు, జీఆర్‌కే నాయుడు, మహాలక్ష్మి నాయుడు, పి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img