Friday, April 26, 2024
Friday, April 26, 2024

3 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. ఫిబ్రవరి 16న త్రిపురలో పోలింగ్‌

మూడు రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. త్రిపురలో ఫిబ్రవరి 16న పోలింగ్‌ జరుగనుంది. నాగాలాండ్‌, మేఘాలయలో ఫిబ్రవరి 27న పోలింగ్‌ జరుగనుంది. మార్చి 2వ తేదీన మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. త్రిపురలో బీజేపీ అధికారంలో ఉండగా.. ముఖ్యమంత్రిగా మాణిక్‌ సాహా ఉన్నారు. గతేడాది మేలో విప్లవ్‌ కుమార్‌ను తప్పించిన బీజేపీ అధిష్ఠానం మాణిక్‌?కు సీఎం బాధ్యతలు అప్పగించింది. త్రిపురలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి .మేఘాలయలో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. ఆ పార్టీ అధినేత కాన్రాండ్‌ సంగ్మా సీఎంగా ఉన్నారు. ఆయన బీజేపీతో పాటు..ఇతర ప్రాంతీయ పార్టీలతో కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మేఘాలయలో 60 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక నాగాలాండ్‌?లో నేషనల్‌ డెమొక్రటివ్‌ ప్రొగ్రెసివ్‌ పార్టీ అధికారంలో ఉంది. నెఫియు రియో సీఎంగా ఉన్నారు. ఈ ప్రభుత్వంలోనూ బీజేపీ భాగస్వామిగా ఉంది. నాగాలాండ్‌ లోనూ 60 అసెంబ్లీ స్థానాలున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img