Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

40 ఏళ్లు దాటిన వారికి బూస్టర్‌ డోసు తప్పనిసరిగా ఇవ్వాలి

కేంద్రానికి ఇన్‌సాకాగ్‌ సూచన
40 ఏళ్ల వయసు దాటిన వారికి బూస్టర్‌ డోసు టీకాలు ఇవ్వాలని జీనోమ్‌ పరిశోధనల గ్రూపు ఇన్‌సాకాగ్‌ కేంద్రానికి సూచించింది. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఆందోళన నేపథ్యంలో తన వీక్లీ బులిటెన్‌లో ఇన్‌సాకాగ్‌ ఈ సిఫారసు చేసింది. కరోనా వైరస్‌లో జరుగుతున్న జన్యు పరిణామాలను పరిశీలిచేందుకు 28 పరిశోధనశాలలతో కూడిన కన్సార్టియం ఏర్పడిన విషయం తెలిసిందే.వ్యాక్సిన్‌ వేసుకోని వారికి ముందుగా టీకాలు ఇవ్వాలని, ఆ తర్వాత 40 ఏళ్లు ఉన్నవాళ్లకు, దాటినవాళ్లకు కోవిడ్‌ బూస్టర్‌ డోసు టీకాలు ఇవ్వాలని ఇన్‌సాకాగ్‌ తెలిపింది. ఎక్కువ రిస్క్‌ ఉన్నవారికి ముందుగా కరోనా టీకా ఇవ్వాలని, ఇప్పుడున్న టీకాలలో తక్కువ స్థాయి యాంటీబాడీలు ఉన్నాయని, వాటితో ఒమిక్రాన్‌ను నిర్వీర్యం చేయడం కుదరదని, అందుకే బూస్టర్‌ డోసు తప్పనిసరి అని సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img