Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

5వేలకు దిగొచ్చిన కొత్త కేసులు..41కి చేరిన ఒమిక్రాన్‌ కేసులు


దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. గత ఏడాది మే నాటి స్థాయికి తగ్గి 6 వేల దిగువకు చేరాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 5,784 కరోనా కేసులు నమోదయ్యాయి. కేసులు ముందురోజు కంటే 21 శాతం మేర తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 252 మంది మృతి చెందగా.. 7,995 మంది పాజిటీవ్‌ బాధితులు కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం ఇప్పటి వరకు 4,75,888 మృతి చెందారు. కరోనా చికిత్స నుంచి 3,41,38,763 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 88,993 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 133.8 కోట్ల మందికి టీకా పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో వెల్లడిరచింది.మరోవైపు దేశంలో ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదైన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 41కి చేరింది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు ఈ కొత్త వేరియంట్‌ వ్యాపించింది. మహారాష్ట్రలో అత్యధికంగా ఈ వేరియంట్‌ను గుర్తించారు. నిన్న మహారాష్ట్రలో 2, గుజరాత్‌లో ఒకటి ఒమైక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.ఈ సమయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా కొవిడ్‌ నియమాలు పాటించాలని ప్రజలకు ఆరోగ్యశాఖ సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img