Monday, May 6, 2024
Monday, May 6, 2024

సీఎం జగన్‌పై దాడి కేసు.. నిందితుడికి మూడు రోజుల పోలీస్‌ కస్టడీ

సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సతీష్‌ను మూడు రోజుల పాటు పోలీస్‌ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈనెల 27వ వరకు సతీష్‌ పోలీసుల కస్టడీలో ఉండనున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్‌పై దాడి కేసులో ఏ-1గా ఉన్న సతీష్‌ను అడ్వొకేట్‌ సమక్షంలోనే విచారించాలని.. నిందితుడిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించొద్దని ఆదేశించింది. నిందితుడిని విచారించిన అంశాలను కోర్టు ముందు ఉంచాలని తెలిపింది. ఇక పోలీసులు గురువారం ఉదయం 10గంటల నుంచి కస్టడీకి తీసుకోనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img