Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

సంక్షేమ పథకాల నిధులు విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఎపీలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో చర్చనీయాంశంగా మారిన డీబీటీ నిధుల పైన కోర్టు స్పష్టత ఇచ్చింది. ఎన్నికల తరువాత నిధుల విడుదల చేయాలనే ఎన్నికల సంఘం ఆదేశాల పైన హైకోర్టు ఒక్క రోజు స్టే విధించింది. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు నిధుల విడుదల చేయవద్దని స్పష్టం చేసింది. దీంతో, ఈ ఒక్క రోజులోనే నగదు విడుదలకు అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో కొన్ని షరుతులు విధించింది.నిధుల జమకు కోర్టు అనుమతిఏపీలో డిబిటీల పంపిణీకి లైన్ క్లియర్ అయింది. గత 59 నెలలుగా లబ్ధి పొందుతున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ హైకోర్టు. విద్యార్థులు, మహిళలు వేసిన పిటిషన్ పై సానుకూలంగా స్పందింస్తూ తీర్పు వెలువరించింది హైకోర్టు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందించకూడదని ఈసీకి పలు రాజకీయ పార్టీలు ఈసీకి ఫిర్యాదులు చేశాయి. అవసరమైతే పోలింగ్ తరువాత ట్రాన్స్‎ఫర్ చేయాలని సూచించాయి. అలాగే పోలింగ్ కు ముందు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయడం వల్ల ఓటర్లు ప్రలోభానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.దీనిపై స్పందించిన ఈసీ డీబీటీ ద్వారా నిధులు విడుదలను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఈసీకి వివరణ ఇచ్చారు.

ఒక్క రోజుకే అనుమతి

గత నాలుగున్నర ఏళ్లుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తున్నామని ఇది ఇప్పటికిప్పుడు తీసుకొచ్చిన పథకం కాదని వివరించారు. పైగా గత 58 నెలలుగా ప్రలోభానికి గురవ్వని వారు కేవలం ఈ ఒక్కసారి మాత్రమే ప్రలోభానికి ఎలా గురవుతారని ప్రశ్నించారు. దీనిపై ఈసీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో కొందరు విద్యార్థులు, మహిళలు, లబ్ధిదారులు కోర్టును ఆశ్రయించారు. తమకు గత నాలుగున్నరేళ్లుగా అందుతున్న లబ్ధికి అడ్డుపడుతున్నారని పిటిషన్ వేశారు. పిటిషన్ ను స్వీకరించిన ఏపీ హైకోర్టు ఈసీకి పలు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఈసీ కోర్టుకు వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో డిబిటీలను నిలుపుదల చేయాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను నేటి వరకు అబయాన్స్‎లో పెట్టింది హై కోర్టు.

షరతులు విధించిన కోర్టు

ఈరోజు డిబిటిల ద్వారా ఆయా పథకాలకు సంబంధించిన నగదును పంపిణీ చేసేందుకు ప్రభుత్వానికి అనుమతి దక్కింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగనుంది. ఆసరా, చేయూత, వసతిదీవెన, విద్యాదీవెన, లా నేస్తం, రైతు భరోసా వంటి పథకాల లబ్ధిదారులకు నగదు జమ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేసి డీబీటీ ద్వారా నగదు ట్రాన్స్ ఫర్ చేసేందుకు ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే డీబిటీల ద్వారా పంపిణీ చేసే పథకాలను ప్రచారం చేయవద్దని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఈ రోజు నగదు జమ కు అవకాశం ఇవ్వటంతో పోలింగ్ వేళ అధికార పార్టీ వైసీపీకి బిగ్ రిలీఫ్ గా మారనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img