Monday, May 20, 2024
Monday, May 20, 2024

ఎన్డీఏకు వైసీపీ వ్యతిరేకమని జగన్‌ ప్రకటించాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విజయవాడ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధానాల అన్యాయం చేసిన నేపథ్యంలో ఎన్డీఏకు వైసీపీ వ్యతిరేకమని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. విజయవాడ ఒన్‌టౌన్‌లోని లెనిన్‌ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ ప్రధాని మోదీ 2019లో తిట్టిన వారినే ఇప్పుడు ప్రక్కన పెట్టుకుని మాట్లాడుతున్నారని చెప్పారు. మోదీ 2014లో రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జాతీయ స్థాయిలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో నిర్ధేశించిన ఏపీకి ప్రత్యేక హోదా, కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, రామాయపట్నం పోర్టు నిర్మాణం ఇతర విభజన హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 2019లో, 2024లో కూడా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. 2014 నుంచి 2018 వరకు కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉందన్నారు. 2018లో ఏపీకి ఇచ్చిన హామీలు నేరవేర్చకపోవటంలో ఎన్డీఏ నుంచి తాము బయటకు వచ్చామని చంద్రబాబు కేంద్రంలో ధర్మపోరాట దీక్షలు చేశారన్నారు. మళ్లీ ఎన్డీఏలో చేరిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చేప్పాలని ఇమాండ్‌ చేశారు. 2019లో ఎన్నికల ప్రచారం మోదీ ప్రసంగిస్తూ జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణానికి ఇచ్చిన నిధులను చంద్రబాబు ఏటీఎంగా వాడుకోవటంతో పూర్తి చేయలేకపోయామని చెప్పటం జరిగిందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అన్ని అంశాల్లో బలపర్చారని చెప్పారు. బీజేపీ సహకారం లేకుండా ఒక్క గంట కూడా జగన్‌ పాలన చేయలేకపోయరని చెప్పారు. రాష్ట్రం అప్పులు పాలు కావటానికి, అమరావతి రాజధాని నిర్మాణం ఆగిపోవటానికి బీజేపీయే కారణం అన్నారు. మోదీని అడ్డంపెట్టుకుని జగన్‌ను రాష్ట్రంలో అప్రజాస్వామిక, అరాచక పాలన చేశారని విమర్శించారు. ఊడిగం చేసిన జగన్‌ను ఇప్పుడు మోదీ విమర్శిస్తున్నారని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి రూ.15వేల కోట్లు ఇస్తే పోలవరాన్ని కట్టలేదని మోదీ చెపుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిసి మోదీ చంద్రబాబుతో కలిశారని స్పష్టం చేశారు. 2024 సిగ్గులేకుండా ఎన్డీఏ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వస్తే రెండేళ్లలో పోలవరాన్ని పూర్తి చేస్తామని ప్రజల్ని నమ్మిస్తున్నారని విమర్శించారు. జఇప్పటి వరకు జరిగిన మూడు విడతలో పోలింగ్‌లో బీజేపీకి ఎదురుగాలి వీచిందన్నారు. ఉత్తర భారతదేశంలో బీజేపీ సీట్లు తగ్గుతున్నాయని, తమిళనాడు, కేరళ రాష్ట్రాలో ఖాతా కూడా తెరవదని చెప్పారు. ఏపీలో టీడీపీ, జనసేనను తమతో ఉంచుకోవటానికి మోదీ ప్రయత్నం చేస్తున్నారన్నారు. కార్పోరేట్‌ వ్యక్తి అయిన సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేయటం సరికాదన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 22 డివిజన్‌లలో 22 ఎమ్మెల్యే కార్యాలయాలు పెట్టిన పని చేస్తానని ప్రకటించిన సుజనా చౌదరి ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండరని చెప్పారు. విజ్ఞులైన ప్రజలు ఆలోచన చేసి ఓట్లు వేయాలన్నారు. సుజనా చౌదరి డబ్బుల సంచులకు ఆశపడి విజయవాడ ప్రతిష్టతను మంటగల్ప వద్దన్నారు. సీఎం జగన్‌ను విమర్శిస్తున్న ఎన్డీఏ కూటమికి తన పార్టీ వ్యతిరేకమని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టం చేయాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఇండియా కూటమి బలర్చిన అభ్యర్థలకు ఈ ఎన్నికల్లో ఓట్లు వేసి గెలించాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నుంచి సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావుకు కంకికొడవలి గుర్తుపై, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ సీపీఎం అభ్యర్థి సీహెచ్‌.బాబూరావుకు సుత్తికొడవలి నక్షత్రం గుర్తుపై, విజయవాడ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి నాంచారయ్యకు, విజయవాడ పార్లమెంటుకు కాంగ్రెస్‌ అభ్యర్థి వల్లూరు భార్గవ్‌కు హస్తం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
పశ్చిమ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ తనకు కమ్యూనిస్టు నాయకునిగా ప్రజల నుంచి ఆదరణ ఉందని, గతంలో కార్పోరేటర్‌గా పని చేసి ప్రజల మన్ననలు పొందానని చెప్పారు. ప్రజలు ఆలోచించి పని చేసే వారికి అవకాశం ఇవ్వాలని కోరారు. గతంలో జైరాం రమేష్‌, అశ్వీనిదత్‌ వంటి వారి ఓట్లు కోసం డబ్బులు వెదజల్లితే ప్రజల తిరస్కరించారని గుర్తు చేశారు. బ్యాంకులకు డబ్బు ఎగొట్టి ప్రజలకు పప్పుబెల్లాలు పంచితే ఓట్లు వేయరని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో సీపీఐ తరుపున పోటీ చేస్తున్న తనకు కంకి`కొడవలి గుర్తుపై ఓట్లు వేసి గెలించాలని విజ్ఞప్తి చేశారు. బ్యాలెట్‌లో తన సీరియల్‌ నంబరు 5వద్ద బటన్‌నొక్కి ఓట్లు వేయాలని ససూచించారు. పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వనర్‌ దోనేపూడి శంకర్‌ మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో జన స్వామ్యానికి, ధన స్వామ్యానికి మధ్య జరుగుతున్న పోటీ అన్నారు. ప్రజలు ఆలోచించి ప్రజాసమస్యలపై పోరాడే వ్యక్తి జి.కోటేశ్వరరావుకు అవకాశం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెన్మెత్స దుర్గాభవాని పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img