Friday, April 26, 2024
Friday, April 26, 2024

కేరళను తాకిన రుతుపవనాలు.. చల్లని వార్త చెప్పిన వాతావరణ శాఖ

అధికారికంగా ప్రకటించిన భారత వాతావరణ శాఖ
వారం రోజుల ఆలస్యంగా కేరళలోకి ప్రవేశం

వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు ఐఎండీ వెల్లడించింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించడం కన్నా ఈసారి వారం ఆలస్యంగా కేరళను తాకాయి. రుతుపవనాల రాకతో కేరళ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నైరుతి రుతుపవనాలు క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు వివరించారు.

ప్రస్తుతం ఎక్కడ
దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. ప్రస్తుతం లక్షద్వీప్‌, కేరళ ప్రాంతాల్లో విస్తరించినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల రాక ప్రభావంతో గత 24 గంటలుగా కేరళ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నట్లు పేర్కొంది. వచ్చే 48 గంటల్లో ఈ నైరుతి రుతుపవనాలు కేరళలోని మిగతా ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు మీదుగా విస్తరించనున్నట్లు తెలిపింది. అందుకు వాతావరణ పరిస్థితులు అనుగుణంగా ఉన్నట్లు వెల్లడించింది. గంటకు 19 నాట్ల వేగంతో పశ్చిమ గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన మొదటి వారంలో వర్షాలు మోస్తరుగా కురిసే అవకాశలు ఉన్నట్లు పేర్కొంది.

ఆలస్యంగా ఆగమనం
సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్‌ 1 నే కేరళ తీరాన్ని తాకాల్సి ఉంది. అయితే వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు, తుపాను కదలికల కారణంగా 7 రోజులు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. గత నాలుగేళ్లతో పోలిస్తే ఈసారి నైరుతి రుతుపవనాల ఆగమనం కాస్త ఆలస్యమైంది. 2022లో మే 29న కేరళ తీరాన్ని తాకగా.. 2021లో జూన్‌ 3న.. 2020లో జూన్‌ 1న నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. ఇక ఈ సంవత్సరం సముద్రంపై ఎల్‌నినో ప్రభావం కనిపిస్తున్నా… ఈ సీజన్‌లో దేశంలో సాధారణ వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే ఏప్రిల్‌లో ప్రకటించింది. భారత దేశంలో ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతు పవనాలు కీలక పాత్ర పోషిస్తాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img