Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

తక్షణమే ఇసుక తవ్వకాలు నిలిపివేయండి.. ఏపీ సర్కార్‌కు సుప్రీం ఆదేశం

ఏపీలో తక్షణమే అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని రాష్ట్ర సర్కార్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్రమ ఇసుక తవ్వకాలను తక్షణం నిలిపివేయడానికి వెంటనే అధికారుల బృందాలను క్షేత్రస్థాయికి పంపాలని ఉన్నతన్యాయస్థానం ఆర్డర్స్ పాస్ చేసింది. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయికి వెళ్లి అక్రమ ఇసుక తవ్వకాలు ఆపేశారా? లేదా? అన్నది తనిఖీ చేయాలని ఆదేశించింది.ఇసుక అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ఏపీ ప్రభుత్వం చర్యలన్నీ కాగితాలకే పరిమితమని.. ఆ విషయం తమకు తెలుసని న్యాయస్థానం పేర్కొంది. వచ్చే గురువారం నాటికి (మే 16) సుప్రీంకోర్టు అక్రమ ఇసుక తవ్వకాల నిలిపివేతపై తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశించినా ఏపీలో ఇసుక అక్రమాలు ఆగడం లేదంటూ ప్రతివాది నాగేంద్ర కుమార్ ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించారు. నాగేంద్ర కుమార్ పేర్కొన్న ప్రదేశాల్లో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకొని తరువాత సుప్రీంకు నివేదించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతివాది నాగేంద్ర కుమార్ తరపున సుప్రీంలో సీనియర్ కౌన్సిల్ సిద్ధార్ధ లూత్రా వాదనలు వినిపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img