Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఆగస్టు 31..మీకు డెడ్‌లైన్‌

అమెరికా, బ్రిటన్‌లకు తాలిబాన్ల హెచ్చరిక
అఫ్ఘాన్‌ నుంచి సైన్యాల ఉపసంహరణ కోసం అదనపు సమయం కోరితే పర్యవసానాలు తప్పవని అమెరికా, బ్రిటన్‌ను తాలిబన్లు తాజాగా హెచ్చరించారు. ఆగస్టు 31 వారికి డెడ్‌ లైన్‌ అని స్పష్టంచేశారు. తాలిబాన్లు అఫ్ఘాన్‌ను హస్తగతం చేసుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆగస్టు చివరికల్లా కల్లా పూర్తిస్థాయిలో తమ బలగాలను వెనక్కు పిలిపించుకుంటామని అమెరికా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తమ బలగాలు, మిత్రదేశాల పౌరుల తరలింపు ప్రక్రియలో భాగంగా ఈ గడువు పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించారు. ఈ వార్తలపై స్పందించిన తాలిబాన్లు ఈ గడువును అమెరికాగానీ, బ్రిటన్‌ గానీ పొడిగించదలిస్తే… అవసరం లేకున్నా వారు అఫ్ఘానిస్థాన్‌లో మరికొంత కాలం ఉండేందుకు నిర్ణయించినట్టు భావించాల్సి ఉంటుంది. వారు తమ నిర్ణయాల పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.’ అని తాలిబన్ల అధికార ప్రతినిధి సుహెల్‌ షాహీన్‌ తాజాగా హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img