Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

ఇకపై రెండేళ్లపాటు కాల్‌డేటా వివరాల నిల్వ

న్యూదిల్లీ : భద్రతా కారణాల రీత్యా టెలికాం శాఖ వినియోగదారుల కాల్‌ డేటా, ఇంటర్నెట్‌ వినియోగ రికార్డులను భద్రపరిచే కనీస వ్యవధిని ఒక సంవత్సరం నుండి రెండేళ్లకు పొడిగించింది. ఈ మేరకు టెలికాం సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది. లైసెన్స్‌లలో సవరణలు డిసెంబర్‌ 21న జారీ అయ్యాయి. డిసెంబర్‌ 22న ఇతర రూపాలలో టెలికాం అనుమతులు పొడిగించబడ్డాయి. ‘లైసెన్స్‌దారు అన్ని వాణిజ్య రికార్డులు/కాల్‌ వివరాల రికార్డు/మార్పిడి వివరాల రికార్డు/ఐపీ వివరాల రికార్డును నెట్‌వర్క్‌లో మార్పిడి చేసిన కమ్యూనికేషన్‌లకు రికార్డ్‌ చేసి నిర్వహించాలి. భద్రతా కారణాల దృష్ట్యా లైసెన్స్‌దారు పరిశీలన కోసం అలాంటి రికార్డులు కనీసం రెండేళ్లపాటు భద్రపరచబడతాయి’ అని టెలికాం శాఖ సర్క్యులర్‌ పేర్కొంది. రెండేళ్ల గడువుమీరిన తదుపరి టెలికాం శాఖ నుండి ఎటువంటి ఆదేశాలు లేకుంటే టెలికాం కంపెనీలు నిల్వ చేసిన డేటాను తొలగించవచ్చు. ప్రజా ప్రయోజనాలు, దేశ భద్రత దృష్ట్యా లేదా టెలిగ్రాఫ్‌ల సరైన ప్రవర్తన కోసం సవరణ అవసరమని సర్క్యులర్‌ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img