Monday, May 6, 2024
Monday, May 6, 2024

ఉపఎన్నికపై మమతా బెనర్జీకి ఊరట

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి ఊరట లభించింది. భవానీపుర్‌ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఉప ఎన్నికలను రద్దు చేయాలని వేసిన పిటిషన్‌ను కోల్‌కతా హైకోర్టు కొట్టివేసింది. ఈనెల 30న జరగాల్సిన భవానీపూర్‌ ఉపఎన్నికపై స్టే ఇచ్చేందుకు కోల్‌కతా హైకోర్టు నిరాకరించింది. ఎన్నికలు యథాప్రకారం జరిపేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. భవానీపూర్‌ నుంచి 2011, 2016లో మమతా ప్రాతినిధ్యం వహించారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంకా తిబ్రేవాల్‌తో మమతా పోటీపడుతున్నారు. 41 ఏళ్ల తిబ్రేవాల్‌ కోల్‌కతా హైకోర్టులో లాయర్‌గా చేస్తున్నారు. ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమి చవిచూశారు. అయినప్పటికీ ఆమె ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ పదవిలో ఆమె కొనసాగాలంటే అక్టోబర్‌ లోపు ఆమె ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img