Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

కేంద్రమంత్రిని పదవి నుంచి తొలగించకుంటే..నిరసనలు మరింత తీవ్రం

రాకేష్‌ టికాయత్‌
యూపీలో లఖింపూర్‌ ఘటనలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను ఆ పదవి నుంచి తక్షణం తొలగించి, నిష్పాక్షిక దర్యాప్తు జరిగేందుకు వీలుగా ఆయనను అరెస్టు చేయాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేష్‌ టికాయత్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అజయ్‌ మిశ్రాపై సెక్షన్‌ 120బి కింద కేసు నమోదు చేయాలన్నారు. ఆయన స్వేచ్ఛగా తిరుగుతున్నారు..రైతులను ఆయన హెచ్చరిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చిందని చెప్పారు. లఖింపూర్‌ ఘటన వెనుక ఆయన ఉన్నారని అన్నారు. కేంద్ర మంత్రి రాజీనామా, ఆరెస్టుకు ఒత్తిడి తీసుకురావడం కోసమే రైల్‌రోకో జరుపుతున్నామని, మంత్రిని ఆ పదవి నుంచి తప్పించనంత వరకూ నిష్పాక్షిక విచారణ సాధ్యం కాదని చెప్పారు. అజయ్‌ మిశ్రాను పదవి నుంచి తొలగించ కుంటే లఖింపూర్‌ హింసాత్మక ఘటనపై నిరసనలను మరింత తీవ్రం చేస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img