Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

దిల్లీలో మరింత పెరిగిన వాయు కాలుష్యం

బాణసంచా పేలుళ్లతో క్షీణించిన వాయు నాణ్యత

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ ప్రమాదకరస్థాయికి చేరుకుంటోంది. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా పేలుళ్లతో వాయు కాలుష్యం భారీగా పెరిగింది. నోయిడాలో అత్యధికంగా కాలుష్యం కమ్ముకుంది. దిల్లీలోని పూసా రోడ్డులోనూ గాలి నాణ్యత క్షీణించింది. దిల్లీిలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) 314 నుంచి 341 వద్ద ఉంది. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడంతో నోయిడాలో ఏక్యూఐ526కు పెరిగింది. దిల్లీలో పూసారోడ్డు వద్ద 505కు చేరింది. ఏక్యూఐ 500 దాటిందంటే తీవ్రమైన కాలుష్యం ఏర్పడిరదని తేలింది.దిల్లీితో పాటు సమీప పట్టణాల్లోనూ కాలుష్యం తీవ్రంగా ఉంది. పంజాబ్‌, హర్యానాలో పొలాల మంటల నుంచి వెలువడిన పొగ దేశ రాజధాని వైపు వచ్చింది.పటాకుల వ్యతిరేక ప్రచారం చేయడంతోపాటు 13,000 కిలోలకు పైగా అక్రమ పటాకులను స్వాధీనం చేసుకొని, 33 మందిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వ అధికారులు చెప్పారు. దిల్ల్లీ ప్రభుత్వం బాణాసంచాపై నిషేధం విధించినప్పటికీ, దీపావళి సందర్భంగా చాలా మంది ప్రజలు వీధుల్లో క్రాకర్లు కాల్చడం కనిపించింది. దీంతోపాటు వ్యవసాయ పొలాల్లో మంటల నుంచి వెలువడిన పొగ వల్ల ఢల్లీిలో గాలి నాణ్యత క్షీణించింది. వాయు కాలుష్యం పెరగడంతో.. ప్రజల్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. కొందరికి గొంతు నొప్పి రావడం.. మరికొందరికి కండ్ల మంట, కంటి నుంచి నీళ్లు వస్తున్నాయి. గాలిలో పీఎం(పార్లిక్యులేట్‌ మ్యాటర్‌) పెరగడం వల్ల గుండె, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img