Friday, May 3, 2024
Friday, May 3, 2024

దేశంలో అలజడి రేపేందుకు వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నాయి


రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని అస్థిరపరచేందుకు భారత వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తునే ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ పాకిస్తాన్‌పై మండిపడ్డారు. దేశంలో కల్లోలం సృష్టించేందుకు పెద్దఎత్తునే ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయని ఓ వార్తసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. సరిహద్దుల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని, ఇరు అణ్వాస్త్ర దేశాల మధ్య పరస్పర విశ్వాసం పాదుకొలిపేందుకు భారత్‌ వేచిచూసే ధోరణి అవలంభిస్తోందన్నారు. ఆర్టికల్‌ 370, 35ఏ రద్దుతో జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదానికి సమసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గల్వాన్‌ లోయ ఘటనకు ఏడాది పూర్తయ్యిందని, సైనికుల సాహసం, శక్తిసామర్థ్యాలు, ఇండియన్‌ ఆర్మీ చూపించిన సంయమనం అసామాన్యమని అన్నారు.ఈ సాహసవీరులను చూసి భవిష్యత్‌ తరాలు కూడా గర్విస్తాయని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img