Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

దేశంలో కొత్తగా 15,981 పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 15,981 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి 166 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోల్చుకుంటే కేసుల సంఖ్య, మరణాల సంఖ్య రెండూ తగ్గాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. నిన్న నిమోదైన కరోనా కేసులు, మరణాల్లో కేరళలో 8867 కేసులు నమోదు కాగా.. 67 మంది మరణించారు. దేశంలో తాజాగా నమోదైన కేసులతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,40,53,573 కి పెరిగింది. దీంతోపాటు మరణాల సంఖ్య 4,51,980 కి చేరింది. అయితే.. నిన్న కరోనా నుంచి 17,861 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,33,99,961 కి చేరింది. గత 24 గంటల్లో 8,36,118 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 97,23,77,045 కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశారు. ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 9,23,003 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వెల్లడిరచింది. వీటితో కలిపి దేశంలో అక్టోబర్‌ 15 వరకు 58,98,35,258 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img