Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

పెట్రో మంట

మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
మళ్లీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. మంగళవారం లీటరు పెట్రోలుపై 29 పైసలు, లీటరు డీజిల్‌పై 32 పైసల వంతున ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలో మంగళవారం పెట్రోల్‌ లీటరు ధర 108.67 రూపాయలకు పెరిగింది. దీల్లీలో పెట్రోల్‌ లీటరుపై 25 పైసలు, డీజిల్‌ లీటరుకు 30 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్‌ లీటరు ధర రూ.102.64, డీజిల్‌ లీటరు ధర రూ.91.07కు పెరిగిందని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ తెలిపింది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100.23, లీటర్‌ డీజిల్‌ ధర రూ. 95.59గా ఉన్నాయి. కోల్‌కత్తాలో పెట్రోల్‌ రూ. 103.36, డీజిల్‌ రూ. 94.17కు పెరిగాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.106.73లకు చేరుకోగా లీటరు డీజిల్‌ ధర రూ. 99.33గా నమోదు అయ్యింది. నవంబరు వరకు ముడి చమురు ఉత్పత్తిని పరితంగానే చేయాలని ఒపెక్‌ దేశాలు నిర్ణయించాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్‌ అయిల్‌కి డిమాండ్‌ పెరిగిపోయింది. దీంతో నవంబరు వరకు ముడి చమురు ధరలు తగ్గే అవకాశం లేదు. దీంతో మరో రెండు నెలల వరకు ప్రభుత్వం.ప్రజలకు పెట్రో వడ్డన చేయనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img