Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

ప్రజలందరికీ ‘క్షమాభిక్ష’ – తాలిబన్ల కీలక ప్రకటన

అఫ్గానిస్థాన్‌ అతలాకుతలమవుతోంది. తాలిబాన్ల పునరాగమనం అఫ్గానీయుల భవితను తలకిందులు చేసింది. దేశం దాటిపోవడమే లక్ష్యంగా ప్రజలు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని పరుగులు తీస్తున్నారు. ఏ విమానం దొరికితే ఆ విమానం ఎక్కేస్తున్నారు. విమానాలు రైళ్లలోని జనరల్‌ బోగీలను తలపిస్తున్నాయి. చివరకు విమానం ఎగిరే సమయంలో దాని చక్రాలను పట్టుకొని ఎగిరిపోవాలన్న ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. విమానాశ్రయాలను ముట్టడిరచబోతున్నట్లు తాలిబాన్లు ప్రకటించడం మరింత భయోత్పాతాన్ని సృష్టించింది. మరోవైపు, దేశంలో తాలిబన్ల అరాచకం పెచ్ఛరిల్లుతోంది. తమ ప్రాణాలను కాపాడంటూ స్త్రీలు విలపిస్తున్న దృశ్యాలు మనసులను కలిచివేస్తున్నాయి. జైళ్లలో ఉన్న తమ మద్దతుదారులను విడిచిపెడుతూ, ఇంకోవైపు ప్రధాన నగరాల్లో ఇంటింటినీ గాలిస్తున్న తాలిబన్లు జనాల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. దొరికిన కాడికి లూటీ చేస్తున్నారు. ఆయుధ డంప్‌లను స్వాధీనం చేసుకున్నారు. దేశప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించగా, వారిని ఉగ్రవాదులుగా పేర్కొంటూ ఫేస్‌బుక్‌ సంచలన ప్రకటన చేసింది. తాలిబన్ల రాక్షస పాలనకు భయపడి అఫ్గానీయులు తండోపతండాలుగా దేశాన్ని వీడుతున్న దృశ్యాలు…ప్రపంచ ప్రజలను కంటతడిపెట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం కోరుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img