Friday, April 26, 2024
Friday, April 26, 2024

మోదీ ప్రతిష్ఠ మసకబారింది

ఏడాదిలో 66 శాతం నుంచి..24 శాతానికి తగ్గిన ఆదరణ
ఇండియా టుడే సర్వేలో వెల్లడి

న్యూదిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠ క్రమంగా మసకబారుతోంది. భవిష్యత్తులోనూ ప్రధానిగా ఆయనే ఉండాలని గత సంవత్సరం కోరుకున్న వారి శాతం సగానికిపైగా తగ్గింది. ఇండియా టుడే మ్యాగజైన్‌ ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ పేరుతో ఈ సంవత్సరం నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ప్రధానిగా మోదీనే ఉండాలని కోరుకున్న వారు 66 శాతం ఉండగా ప్రస్తుతం అది 24 శాతానికి పడిపోయింది. దీంతో తదుపరి ప్రధానిగా ఎవరిని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు దేశ ప్రజలు మోదీకి దిమ్మతిరిగే సమాధానం చెప్పారనే భావించాల్సి వస్తోంది. ప్రధాని ప్రతిష్ట ఇంతగా దిగజారడానికి దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రెండవ దశ కోవిడ్‌ -19ని నిలువరించడంతో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రధాన కారణాలుగా ప్రజలు భావిస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది. ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వే దేశ ప్రజలు వెలిబుచ్చే అభిప్రాయాలకు నిలువుటద్దం లాంటిది. ప్రతి ఏడాది జనవరి, ఆగస్టులో ఈ సర్వే ఫలితాలు వెల్లడవుతుంటాయి. ఇక, తాజా సర్వేను ఆంధ్రప్రదేశ్‌, అసోం, బీహార్‌, చత్తీస్‌గఢ్‌, దిల్లీ, గుజరాత్‌, హర్యానా, రaార?ండ్‌, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని 115 పార్లమెంటరీ, 230 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత నెల 10-20 మధ్య నిర్వహించారు. మొత్తంగా 14,559 మందిని ఇంటర్వ్యూ చేశారు. వీరిలో 71 శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారు కాగా, 29 శాతం పట్టణ ప్రాంతాలకు చెందినవారు. అలాగే, 50 మందిని నేరుగా, మిగతా 50 శాతం మందిని టెలిఫోన్‌ ద్వారా ఇంటర్వ్యూ చేశారు. పైన పేర్కొన్న అంశాలపై వారి అభిప్రాయాలను రాబట్టారు. అలాగే, రైతు చట్టాలు, సెంట్రల్‌ విస్టా నిర్మాణం, మత సామరస్యం, మహిళా రక్షణ వంటివాటిపైనా ప్రశ్నలు సంధించింది.
ఇక ప్రధానిగా రెండవ ప్రాధాన్యత విషయంలో ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌్‌ దాస్‌కు 11 శాతం మంది మద్దతు ప్రకటించగా, 10 శాతం మంది మాత్రం రాహుల్‌ గాంధీని ప్రధానిగా చూడాలని భావిస్తున్నట్టు సదరు సర్వే వెల్లడిరచింది. గతంతో పోల్చి చూస్తే ఆదిత్యనాథ్‌ రాహుల్‌ గాంధీ ఇద్దరికీ 3 నుంచి 8శాతం ప్రజాదరణ పెరగింది. ఇదిలా ఉండగా సీఎంల విషయానికి వస్తే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ 42 శాతం మంది ఓట్ల మద్దతుతో తొలిస్థానాన్ని పొందారు. అసోం సీఎం హిమంత బిస్వా శర్మ రెండో స్థానంలో నిలువగా, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మూడో స్థానాన్ని పొందినట్టు ఆ సర్వే పోల్స్‌ వెల్లడిరచింది. ఇక మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నాలుగోస్థానం, కేరళ సీఎం విజయన్‌ ఐదో స్థానం, ఓడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఆరో స్థానం, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌కు ఏడవ స్థానం దక్కింది. ఇక ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతోంది అని భావించే వారి శాతం గణనీయంగా పెరిగింది. ఆరునెలల క్రితం 17 మంది మాత్రమే ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతోందని భావించగా ప్రస్తుతం వారి సంఖ్య 32 శాతానికి పెరిగినట్టు సర్వేలో వెల్లడైంది. ఇక దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్భణాన్ని నిలువరించడానికి కూడా ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయలేదని సర్వేలో ఎక్కువమంది పేర్కొన్నారు. ఈ వివరాలన్నిటితో ప్రముఖ జర్నలిస్ట్‌ శివమ్‌ విజ్‌ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img