Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టిక్కెట్లు

ప్రియాంక గాంధీ
ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మీడియాకు వెల్లడిరచారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సన్నద్ధతను సమీక్షిచేందుకు మంగళవారంనాడు లక్నోలో ప్రియాంక ఉన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని పునరుద్ధరించే బాధ్యతను ఆమెకు పార్టీ అధిష్టానం అప్పగించింది. ఇవాళ లక్నోలో మీడియాతో మాట్లాడుతూ, ‘నేను ఇవాళ మా మొదటి హామీ గురించి మాట్లాడబోతున్నా. వచ్చే ఏడాది యూపీలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్లు కేటాయించాలని నిర్ణయించాం..భవిష్యత్తులో మహిళలకు కేటాయించే టికెట్ల సంఖ్యను 40 శాతం నుంచి 50 శాతానికి పెంచుతాం’ అని ఆమె తెలిపారు. గత కొద్ది నెలలుగా ప్రియాంక యూపీలో వరుస పర్యటనలు సాగిస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో తరచు సమావేశమమవుతున్నారు. ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ లక్నోకు షిఫ్ట్‌ అయ్యేందుకు కూడా ప్రస్తుతం ఆమె ఏర్పాట్లు చేసుకున్నారు. లక్నోలో ఉంటూ ఎన్నికల ప్రచారానికి అవసరమైన వ్యూహరచనతో పాటు 75 జిల్లాల్లో పర్యటనలను సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, పొత్తుల సాధ్యాసాధ్యాలు, వ్యూహరచనలో కీలక భూమిక పోషించనున్నారు. లఖింపూర్‌ హింస అనంతరం ప్రియాంక ప్రజలతో మరింత మమేకమవుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img