Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పార్టీ ఇప్పుడు కాదు

3 వేల కి.మీ.పాదయాత్ర చేస్తా
బీహారు అభివృద్ధికి పాటుపడతా: పీకే

నూదిల్లీ: తాను ఇప్పటికిప్పుడు రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం లేదని, ముందుగా బీహారులో పాదయాత్ర చేసి..ప్రజల కష్టాలు, అవసరాలు తెలుసుకుంటానని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) వెల్లడిరచారు. ఇటీవల చేసిన ఓ ట్వీట్‌తో ఆయన రాజకీయ ప్రయాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పీకే సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. తాజాగా దీనిపై ఆయన స్పష్టతనిచ్చారు. ప్రస్తుతానికి కొత్త పార్టీ ఏమీ పెట్టడంలేదని వెల్లడిరచిన పీకే..బీహార్‌ పురోగతి కోసం మూడువేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రజలను నేరుగా కలుసుకోవాల్సిన సమయం వచ్చింది. అందుకు మార్గం ‘జన సురాజ్‌’. ఈ కొత్త ప్రయాణం బీహార్‌ నుంచే ఉంటుందని ప్రశాంత్‌ కిశోర్‌ ప్రకటించారు. గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి తన భవిష్యత్తు కార్యాచరణను వెల్లడిరచారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన 17వేల నుంచి 18వేల మంది ప్రముఖులను కలిసి మాట్లాడనున్నట్లు పీకే వివరించారు. వారి నుంచి సమస్యలు, అభిప్రాయలు తెలుసుకోనున్నట్లు చెప్పారు. ఒకవేళ తమ సమస్యల పరిష్కారం కోసం ఓ రాజకీయ వేదిక కావాలని బీహార్‌ ప్రజలు కోరకొంటే..తప్పకుండా దాని గురించి ఆలోచిస్తానని, అయితే, రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు లేనందున హడావుడిగా కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదుని పీకే వెల్లడిరచారు. అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ చంపారన్‌లోని గాంధీ ఆశ్రమం నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు పీకే చెప్పారు.. రాష్ట్రవ్యాప్తంగా 3వేల కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగుతుందన్నారు. రాష్ట్ర పురోభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. బీహార్‌ ఇప్పటికీ ఇతర రాష్ట్రాల కంటే చాలా వెనుకబడి ఉంది. లాలూ, నితీశ్‌ పాలనలో రాష్ట్రం ఏ మాత్రం పురోగతి సాధించలేదు. అందుకే వచ్చే మూడు, నాలుగేళ్లు ప్రజలను కలుస్తా. ఇంటింటికీ వెళ్లి క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుంటా. వారి నుంచి అభిప్రాయాలు కోరతానని పీకే తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img