Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సెప్టెంబరు 12న నీట్‌

నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

న్యూదిల్లీ:
కరోనా ఉద్దృతి కారణంగా వాయిదా పడిన నీట్‌ (యూజీ) 2021 పరీక్ష నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం కొత్త తేదీని ఖరారు చేసింది. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీ క్షను దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 12న నిర్వహించ నున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటించారు. కొవిడ్‌ నిబంధనలను అనుసరించి ఈ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం సాయంత్రం 5గంటల నుంచి ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో ప్రారంభమ వుతుందని తెలిపారు. భౌతికదూరం నిబంధనల మేరకు ఈ పరీక్ష నిర్వహించే పట్టణాల సంఖ్యను 155 నుంచి 198కి పెంచుతున్నట్టు వెల్లడిరచారు. గతేడాది 3862గా ఉన్న పరీక్షా కేంద్రాలను పెంచనున్నట్టు వెల్లడిరచారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులందరికీ మాస్క్‌లు అందజేయడంతో పాటు శానిటైజర్లు అందుబాటులో ఉంచనున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. మరోవైపు, తొలుత ఆగస్టు 1న నీట్‌ నిర్వహిస్తామని మార్చిలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించిన విషయం తెలిసిందే. హిందీ ఇంగ్లీష్‌తో పాటు 11 భాషల్లో పెన్‌ అండ్‌ పేపర్‌ పద్ధతిలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. కరోనా ఉద్ధృతి కారణంగా అనేక పరీక్షలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. నీట్‌ పరీక్షను వాయిదా వేసింది. ప్రస్తుతం కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్నందున సెప్టెంబరు 12న పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img