Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

సైన్యంపై వ్యయం భారం కాదు: నరవణే

గాంధీనగర్‌: సాయుధ బలగాలపై ఖర్చును రాబడిని ఇచ్చే పెట్టుబడిగా చూడరాదని, దీనిని ఆర్థిక వ్యవస్థపై భారంగానూ పరిగణించరాదని సాయుధ దళాల చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణే అన్నారు. రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ‘ఫిఫ్టీ ఇయర్స్‌ ఆఫ్‌ 1971 వార్‌: అకౌంట్స్‌ ఫ్రమ్‌ వెటరన్స్‌’ అనే పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశంతో కూడిన ఈ పుస్తకాన్ని విశ్వవిద్యాలయం సంకలనం చేసింది. అనంతరం ఆయన ప్రసంగించారు. ఏదైనా దేశంలో సాయుధ బలగాలు పటిష్ఠంగా ఉన్నప్పుడే షేర్‌ మార్కెట్‌ను తుడిచిపెట్టేసి వేలాది మంది పెట్టుబడిదారులను దివాలా తీయించే షాక్‌లను దేశం తట్టుకోగలదని ఆయన పేర్కొన్నారు. ‘ఎక్కడైనా యుద్ధం జరిగినప్పుడు… ఒక ప్రాంతంలో అస్థిరత ఏర్పడినప్పుడు… మీరు వెంటనే షేర్లపై, స్టాక్‌ మార్కెట్‌పై ప్రభావాన్ని చూ స్తారు…దేశంలోని సాయుధ బలగాలు పటిష్ఠంగా ఉంటేనే ఇలాంటి షాక్‌ల నుంచి బయటపడగలం’ అని ఆయన అన్నారు. దేశ భద్రతలో సాయుధ బలగాలు ప్రధాన పాత్ర పోషిస్తుండగా, రాష్ట్రంలోని ఇతర పోలీస్‌ విభాగాలు కూడా అంతే ముఖ్య పాత్ర పోషిస్తాయని నరవాణే పేర్కొన్నారు. తల్లిదండ్రులు అడిగినందుకు లేదా తోటివారి ఒత్తిడితో కాకుండా తమకు తోచిన మంచి పని ఏదైనా చేయాలని విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఆయన సూచించారు. సైన్యంలో మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img