Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

స్పీకర్‌ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే ప్రమాదం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాజధాని రైతుల అమరావతిఅరసవిల్లి పాదయాత్రపై స్పీకర్‌ తమ్మినేని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఖండిరచారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి కోసం గత వెయ్యి రోజులకుపైగా ఉద్యమం కొనసాగుతోంద న్నారు. కోర్టులో మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మరోసారి ఆ వివాదానికి తావిస్తోందని విమర్శించారు. ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని, హైకోర్టు ఆదేశించినప్పటికీ ఆరు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించటం దుర్మార్గమని ఖండిరచారు. ఇప్పటికే అమరావతిలో రూ.10వేల కోట్ల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, అమరావతిని ధ్వంసం చేయాలనే కుట్రతో జగన్‌ సర్కార్‌ పావులు కదపటం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ… అమరావతి రైతులు, మహిళలు ‘అమరావతి టు అరసవిల్లి’ పాదయాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ పాదయాత్రపై అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అనుచిత వ్యాఖ్యలను రామకృష్ణ తప్పుబట్టారు. ప్రజా ప్రతినిధులందరికీ ఆదర్శంగా ఉండాల్సిన స్పీకర్‌…సాధారణ ఎమ్మెల్యేగా దిగజారి మాట్లాడటం తగదన్నారు. స్పీకర్‌ స్థానంలో తమ్మినేని సీతారాం చేసిన దురుసు వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, స్పీకర్‌ వివాద రహితుడిగా, అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా ఉండాలేగాని, తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించ కూడదన్నారు. విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేయాలనుకుంటే స్పీకర్‌ స్థానం నుంచి వైదొలిగి, అధికార పార్టీ మంత్రిగానో, ఎమ్మెల్యే గానో ఉండవచ్చని హితవు పలికారు. ఇప్పటికైనా జగన్‌ ప్రభుత్వం కళ్లు తెరిచి, వివాదాలకు తావివ్వకుండా, అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అమరావతి అభివృద్ధి చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img