Friday, April 26, 2024
Friday, April 26, 2024

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఉద్యమం తప్పనిసరి

పొన్నూరు : విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢల్లీిలో ఉక్కు కర్మాగారం కార్మికులు, ఉద్యోగులు చేస్తున్న దీక్షలకు మద్దతుగా పొన్నూరులో మంగళవారం స్థానిక గుంటూరు బస్టాండ్‌ వద్ద అఖిలపక్ష కమిటీ నాయకులు దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను సీపీఐ(ఎంఎల్‌) నాయకులు గోగినేని పరశురామయ్య ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షులు అరేటి రామారావు దీక్షల నుద్దేశించి మాట్లాడుతూ అమృతరావు ఆమరణ దీక్షకు మద్దతుగా 32 మంది బలి దానంతో, 52 మంది ఉభయ కమ్యూనిస్టుపార్టీల ఎమ్మెల్యేలు, 15 మంది ఇతర ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి పోరాడిన ఫలితంగా విశాఖ ఉక్కు కర్మాగారం వచ్చిందని, దానిని ప్రైవేట్‌పరం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పొన్నూరు నియోజకవర్గ నాయకులు జక్కా శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఉక్కు కర్మాగారము మద్రాస్‌ రాష్ట్రం, లేదా కర్ణాటకకు ఇవ్వాలని ఆయా రాష్ట్రాల వారు అడుగుతున్న సందర్భాల్లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ మన రాష్ట్రానికే కేటాయించి ఉక్కు కర్మాగారం నిర్మించారని అన్నారు. కానీ నేడు కేంద్రంలో ఉన్న నరేంద్రమోడీ ప్రభుత్వం ఉక్కు కర్మాగారంను ప్రైవేటీకరణ చేయటానికి సిద్ధంగా ఉన్నందని ఈ విధానాన్ని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించాలన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు అహ్మద్‌ ఖాన్‌ మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచటం దారుణమన్నారు. ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ నాయకులు అక్కిదాసు జోసెఫ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయటమే పనిగా పెట్టుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ది చెప్పే రోజూ ఎంతో దూరం లేదన్నారు. ప్రముఖ న్యాయ వాది షేక్‌ బాజీ మాట్లాడుతూ మనరాష్ట్రంలో బీజేపీ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నదన్నారు. వారికి నిజమైన దేశభక్తి వుంటే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బి.బాబురావు, వెంకటేశ్వర్లు, హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img