Wednesday, August 17, 2022
Wednesday, August 17, 2022

102వ రోజుకి చేరిన రైతుల నిరసన రిలే దీక్షలు

విశాలాంధ్ర`తాడేపల్లి : తాడేపల్లి, కొలనుకొండ, కుంచనపల్లి చెందిన యూ-1 రిజర్వ్‌ జోన్‌ భాధిత రైతులు తాడేపల్లి మున్సిపల్‌ కార్యాలయం వద్ద చేస్తున్న రిలే దీక్షలు శుక్రవారం 102వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా భాధిత రైతులు మాట్లాడుతూ యూ-1 రిజర్వ్‌ జోన్‌ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ దీక్షల్లో భాధిత రైతులు దొంతి రెడ్డి సాంబిరెడ్డి, మేకా శ్రీధర్‌ రెడ్డి, బండి సుధాకర్‌ రెడ్డి, మేకా అంజిరెడ్డి, మేకా శ్రవణ్‌ కుమార్‌ రెడ్డి, మేకా శివారెడ్డి, బుర్రముక్కు పోతురాజు రెడ్డి, మేకా మహేష్‌ రెడ్డి, మున్నంగి సంజీవరెడ్డి, బండి సాంబిరెడ్డి, నూతక్కి శ్రీనివాసరావు, బడే కోమలి, భీమయ్య, రామిరెడ్డి, మేకా ప్రతాప్‌ రెడ్డి, సుబ్రహ్మణ్యం, కేళి వెంకటేశ్వరరావు, బాధిత రైతులు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img