Monday, December 5, 2022
Monday, December 5, 2022

అర్హులందరికీ రేషన్‌ కార్డులు అందజేస్తాం : సబిత

విశాలాంధ్ర`హైదరా బాద్‌ : లబ్ధిదారులకు నూతన రేషన్‌ కార్డు లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు. గురువారం మహేశ్వరంలోని పోతర్లా బాబయ్య ఫంక్షన్‌ హాలులో 837 మంది అర్హులకు రేషన్‌ కార్డులను జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ అనితా హరినాథ్‌ రెడ్డితో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాటా ్లడుతూ రంగారెడ్డి జిల్లాలో 35 వేల 488 నూతన రేషన్‌ కార్డులు మంజూర య్యాయని, మహేశ్వరం నియోజక వర్గంలో 6971 కార్డులు, మహేశ్వరం మండలంలో 837 మందికి నూతన రేషన్‌ కార్డులను అందజేసినట్లు తెలి పారు. ఏ ఒక్క కుటుంబం ఆకలితో ఉండకూడదనే ఉదేశ్యంతో రేషన్‌ కార్డులేని ప్రతి ఒక్కరికి నూతన రేషన్‌ కార్డులు అందించాలనే ఉదేశ్యంతో సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలను ఆదుకుంటుందని తెలిపారు. అనంతం కందుకూరులోని సామ నర్సింహారెడ్డి గార్డెన్లో కందుకూరు మండలానికి సంబందించిన 1042 మంది లబ్ధిదారులకు నూతన రేషన్‌ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ అనిత రెడ్డి, ఆర్డీఓ వెంకటచారి, ఎం.ఆర్‌ఓలు, జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి మనోహర్‌ రాథోడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వరలక్ష్మి సురేందర్‌, సహకార సంఘ చైర్మన్‌ చంద్ర శేఖర్‌, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img