Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అంతర్జాతీయ భద్రత, స్థిరత్వానికి ఈజిప్టు`రష్యా పిలుపు

కైరో: రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, సహకార ఒప్పందాలపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌-ఫత్తా అల్‌-సిసి, రష్యా విదేశాంగ మంత్రి సెర్టీ లవ్‌రోవ్‌లో చర్చలు జరిపారు. కైరోలో ఆదివారం జరిగిన ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర ఆందోళనతో కూడిన ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించారు. ఈజిప్టుతో ద్వైపాక్షిక సంబంధాలను ఏకీకృతం చేయడానికి రష్యా ప్రాముఖ్యతను తెలియజేస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నుంచి లవ్‌రోవ్‌ సీసీకి లేఖను అందజేసినట్లు ఈజిప్టు అధ్యక్ష కార్యాలయం తెలిపింది. కైరో`మాస్కోల మధ్య పెరుగుతున్న సహకారం, వివిధ రంగాల్లో ఉమ్మడి ప్రాజెక్టులు, ఈజిప్టులోని రష్యన్‌ ప్రాజెక్టులు, ప్రస్తుతం నిర్మిస్తున్న ఎల్‌-డబా అణు విద్యుత్‌ ప్లాంట్‌, సూయజ్‌ కెనాల్‌ అంశాలపై రష్యన్‌ పారిశ్రామిక జోన్‌ ఏర్పాటు వంటి వాటిని సమీక్షించారు. రష్యా-ఉక్రేనియన్‌ సంఘర్షణకు సంబంధించి, ఈజిప్టు సంక్షోభానికి రాజకీయ పరిష్కారం కోసం పిలుపును పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ భద్రత, స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి సమస్యను ‘‘రాజకీయంగా’’ పరిష్కరించే అన్ని ప్రయత్నాలకు ఈజిప్టు మద్దతు పలికింది. దౌత్యపరమైన పరిష్కారాలకు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఫిబ్రవరి చివరలో ప్రారంభమైన రష్యన్‌-ఉక్రేనియన్‌ వివాదం ప్రారంభమైన తర్వాత లవ్‌రోవ్‌ చేపట్టిన మొదటి ఆఫ్రికా పర్యటన ఇది. ఈ పర్యటనలో ఇథియోపియా, ఉగాండా, డెమొక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో ఉన్నాయి. ఆఫ్రికాలో తన పర్యటన 2023 మధ్యలో జరగనున్న రెండో రష్యా-ఆఫ్రికా శిఖరాగ్ర సమావేశాలపై చర్చించినట్లు లావ్‌రోవ్‌ పేర్కొన్నాడు. పాలస్తీనా-ఇజ్రాయిల్‌ సమస్యపై తాను లవ్‌రోవ్‌తో చర్చించానని సీసీ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img