Friday, April 26, 2024
Friday, April 26, 2024

అంతర్జాతీయ సంఫీుభావం విస్తృతమవ్వాలి

ఇరాన్‌ కమ్యూనిస్టుపార్టీ పిలుపు
టెహ్రాన్‌: ఇరాన్‌ ప్రజల పోరాటానికి అంత ర్జాతీయ సంఫీుభావం మరింత విస్తృతం కావాలని ప్రపంచ కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీలకు ఇరాన్‌ తుదే పార్టీ 7వ కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. శాంతి పరిరక్షణలో భాగంగా శ్రామిక-వర్గ ప్రజల పోరాటాలకు మద్దతుగా ప్రపంచంలోని కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీలకు (సీడబ్ల్యుపీ) ఇరాన్‌ కమ్యూనిస్టు పార్టీ 7వ కాంగ్రెస్‌లో పాల్గొన్న ప్రపంచ ప్రతినిధులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రపంచంలోని వివిధ దేశాలను నుంచి పదుల సంఖ్యలో కమ్యూనిస్టు, వర్కర్‌ పార్టీల సభ్యులు, సానుభూతిపరులు ఈ సమావేశానికి ఉద్వేగభరితమైన సంఫీుభావ సందేశాలు పంపారు. దోపిడీ, అణచివేతలేని నూతన సమాజానికి ఇరాన్‌ లోని శ్రామిక ప్రజల పోరాటానికి లింగ, జాతి వివక్షతలేని, పర్యావరణ విధ్వంసం-సవాళ్లు, బాధ్యత లను ఎదుర్కోవడానికి పతినిధుల సంకల్పాన్ని బలో పేతం చేయాలని ఈ సమావేశం సంకల్పించింది. మధ్యప్రాచ్యంలో అనేక రాజకీయ పార్టీలు సామ్రాజ్య వాద తిరోగమన విధానాల ఫలితంగా ప్రపంచ ఆధిపత్యంకోసం చూస్తోంది. ఈ పోరాటాల నుంచి ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌ విధానాలు ఆయా ప్రాంతంలోని పరిణామాలపై ప్రతికూల, విధ్వంసక చర్యలనుచేపట్టింది. ఇరాన్‌లోని పాలక వర్గం కార్మిక, పర్యావరణ పరిరక్షణ, సమాన హక్కులు, ఆరోగ్యం, భద్రత, పని గంటలు, ట్రేడ్‌ యూనియన్‌లకు అవసర మైన కనీస ప్రమాణాలకు సంబంధించిన అంతర్జా తీయ ఒప్పందాలకు ఎటువంటి నిబద్ధత పాటించకపోవడంపై ఇరాన్‌లోని యువ తరం సమకాలీన ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి నిర్మాణానికి సహకరించే హక్కును కోల్పో యింది. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌లో మహిళలు సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి అవకాశంలేదు. యువకులు నిస్సహాయ పరిస్థితుల్లో సామాజిక-ఆర్థిక చిక్కులను ఎదుర్కొంటున్నారు. దేశంలో సామాజిక సంపద, మేధస్సు, సృజనాత్మకత పరిమితం చేయ బడిరది. బూర్జువా వర్గం పాలక మతాధికారుల పాలనతో ప్రయోజనం పొందుతూ దేశ జాతీయ సంపదను సహజ వనరులను దోచుకోవడం ద్వారా ఆడంబరమైన విలాసవంతంగా జీవిస్తున్నారు. ఈ సందర్భంలో, శాంతి, పురోగతి, సామాజికం న్యాం కోసం ఇరాన్‌ ప్రజల పోరాట స్థాయిని పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల శక్తులతో సన్నిహిత సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరాన్‌ కమ్యూనిస్టుపార్టీ విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img