Friday, April 26, 2024
Friday, April 26, 2024

అమెరికా దుందుడుకు చర్యలను సహించం : చైనా

బీజింగ్‌: అమెరికా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, చర్యలపై చైనా సైనిక ప్రతినిధి మండిపడ్డారు. తైవాన్‌ స్వాతంత్య్రంపై వేర్పాటువాద శక్తులకు తప్పుడు సంకేతాలు పంపడం మానాలని స్పష్టం చేశారు. అమెరికా ఇటీవలికాలంలో రెచ్చగొట్టే వ్యాఖ్యాలు చేయడం సరికాదని రక్షణశాఖ ప్రతినిధి వు కియాన్‌ విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. అంతర్జాతీయ సంబంధాలను నియంత్రించే అంతర్జాతీయ చట్టం, ప్రాథమిక నిబంధనలు ఉల్లంఘించడం, చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం,చైనా ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని, భద్రతా ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీసే అమెరికా వ్యాఖ్యలను, చర్యలను చైనా గట్టిగా వ్యతిరేకిస్తుందని అన్నారు. రెండు దేశాల మధ్య మూడు ఉమ్మడి నిబంధనలకు కట్టుబడి ఉండాలని అన్నారు. అగ్నితో ఆడుకోవద్దని హెచ్చరికలు జారీ చేశారు. చైనీస్‌ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img