Friday, April 26, 2024
Friday, April 26, 2024

‘ఇడా’తో నీట మునిగిన న్యూయార్క్‌

న్యూయార్క్‌ : అమెరికాను ఇడా తుపాను వణికిస్తోంది. భారీ వర్షం..భీకర గాలులు అక్కడ ప్రజల్ని వణికిస్తున్నాయి. ప్రధానంగా అమెరికాలోని లూసియానా, పెన్సిల్వేనియాలతో పాటు తాజాగా న్యూయార్క్‌ ప్రాంతాన్ని తుపాను ఇడా తీవ్ర బీభత్సం సృష్టిస్తోంది. న్యూయార్క్‌ పూర్తిస్థాయిలో నీట మునిగింది. లూసియానా పవర్‌గ్రిడ్‌ స్తంభించింది. తుపానుతో కనీసం ఇప్పటివరకు తొమ్మిది మంది మరణించారు. న్యూ ఓర్టీన్స్‌ వెలుపల అనేక ప్రాంతాలు గజగజ వణుకుతున్నాయి. శక్తివంతమైన గాలులతో ధ్వంసమైన పవర్‌లైన్‌లు, వంతెనలు,చెట్టు నేలమట్టమయ్యాయి. సబ్‌వేలు నీటమునిగాయి. చాలాప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. విమానాలు రద్దయ్యాయి. మెట్రో రవాణా నిలిచిపోయింది. తుపాను దృష్ట్యా ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు న్యూయార్క్‌ గవర్నర్‌ కేటీ హోచుల్‌ తెలిపారు. న్యూజెర్సీలోనూ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అధ్యక్షుడు బైడెన్‌ మిసిసిపితోపాటు ఆయా నగరాల మేయర్‌లతో చర్చించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img