Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సమాజానికి యువత వెన్నెముకగా నిలవాలి

సెంట్రల్‌పార్టీ స్కూల్‌లో జిన్‌పింగ్‌ ఉద్బోధ
బీజింగ్‌: యువత తమ ఆదర్శాలను దృఢపరచుకోవాలని, పార్టీకి విధేయులుగా ఉండాలని, వాస్తవాల నుంచి నిజాల్ని అన్వేషించాలని, బాధ్యతలను తీసుకోవాలని, ప్రజలు విశ్వసించే సమాజానికి వెన్నెముకగా యువత ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) సెంట్రల్‌ పార్టీ స్కూల్‌లో యవతను ఉద్దేశించి జిన్‌పింగ్‌ ప్రసంగించారు. సీపీసీ ప్రజల ప్రయోజనాల కోసం ఉన్నత ఆదర్శాలతో పనిచేస్తారని అన్నారు. చైనా జాతీయసార్వభౌమత్వం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను కాపాడాలని ఆయన యువ అధికారులను కోరారు. కమ్యూనిస్టులు చిత్తశుద్ధి, ధైర్యాన్ని కలిగిఉండాలన్నారు. ప్రమాదాలు ఎదురైనప్పుడు పిరికివారుగా ఉండకూడదని పేర్కొన్నారు. కమ్యూనిజం ఆదర్శంతో చైనా లక్షణాలతో సోషలిజం భాగస్వామ్యంతో చైనా యువత ప్రపంచానికి ఆదర్శం కావాలన్నారు. మార్క్సిజం భావజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా యువత ఆచరించాలన్నారు. పార్టీకి విధేయతగా ఉండటమే ఉత్తమ నిదర్శనమని, పార్టీ నాయకత్వాన్ని నిలబెట్టడం,అధికారాన్ని కేంద్ర నాయకత్వాన్ని కాపాడటం లక్ష్యంగా పనిచేయాలని జిన్‌పింగ్‌ దిశా నిర్దేశం చేశారు. కష్టతరమైన అనుభవం లేకుండా విజయం అరుదుగా వస్తుందన్నారు. ప్రశంసలు, విమర్శలు రెండిరటినీ స్వీకరించాలని సూచించారు. నియమాలను, సూత్రాలను పాటించడం కమ్యూనిస్టుల ప్రధాన లక్ష్యంగా జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. పార్టీ అధికారులందరూ న్యాయంగా విధులు నిర్వర్తించాలన్నారు. వ్యక్తిగత ఆదరణకు చోటు ఉండకూడదని జిన్‌పింగ్‌నొక్కి వక్కాణించారు. ఈ సమావేశానికి సీపీసీ సెంట్రల్‌ కమిటీ సెక్రటేరియట్‌ సభ్యుడు వాంగ్‌ హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img