Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఉక్రెయిన్‌ అధ్యక్షుడి కారుకు ప్రమాదం

కీవ్‌: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్పగాయాలైనట్లు ఆయన ప్రతినిధి సెర్గీ నైకిఫోరోవ్‌ పేర్కొన్నారు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం రష్యా దళాల నుండి స్వాధీనం చేసుకున్న ఖార్కీవ్‌ ప్రాంతంలోని ఇజియం నగరాన్ని సందర్శించి తిరిగి వస్తుండగా ఈ ఈ ప్రమాదం జరిగింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు, భద్రతా సిబ్బంది వాహనాలను ఓ ప్యాసింజర్‌ వాహనం ఢీ కొనడంతో ఈప్రమాదం జరిగింది. అధ్యక్షుడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, తీవ్రమైన గాయాలేమీ కాలేదని సెర్గీ ఫేస్‌ బుక్‌ లో పోస్ట్‌ చేశారు. ప్యాసింజర్‌ కారులో ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో అతనిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img