Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఉ.కొరియా బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం


సియోల్‌: దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా సైనిక విన్యాశాలను చేపట్టనుండటం ఉత్తర కొరియాకు కోపం తెప్పించింది. తమ దేశంపై దండ యాత్ర చేసేందుకు ఈ రెండు దేశాలు యత్నిస్తున్నాయని, ఈ విన్యాశాలను తేలిగ్గా తీసుకునే ప్రసక్తే లేదని ఇప్పటికే దక్షిణ కొరియా, అమెరికాకు స్పష్టం చేసింది. ఇదే క్రమంలో శనివారం జపాన్‌ సముద్రం వైపుగా బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాన్ని చేపట్టింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ (జేసీఎస్‌) ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ క్షిపణి సామర్థ్యం గురించి, అది ఎంత వేగంగా ఎంత దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదన్న సమాచారాన్ని ఇవ్వలేదు. జనవరి 1న షార్ట్‌ రేంజ్‌ బాలిస్టిక్‌ క్షిపణిని ఉత్తర కొరియా విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షతో 2023లో అణ్వాస్త్రాల ప్రయోగానికి ప్యాంగ్యాంగ్‌ నాంది పలికిన విషయం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img