Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

ఐరాసతో మరింత సమన్వయం : చైనా

బీజింగ్‌: సమతుల్య, సమన్వయ, సమ్మిళిత ప్రపంచ అభివృద్ధికోసం ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తెలిపారు. యుఎన్‌లో చైనా గుర్తింపుకు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చైనా, ఐరాస సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టులను సమీక్షించారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు ఉత్తేజపూరితమైన ప్రసంగం చేశారు. ఒక దేశం ఎంత శక్తివంతమైనదైనా ఆధిపత్యం ద్వారా ఇతర దేశాలను శాసించరాదని సూచించారు. యుఎన్‌ చార్టర్‌ ప్రయోజనాలకు, సూత్రాలకు కట్టుబడిఉండాలన్నారు. పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనాను గుటెర్రెస్‌ అభినందించారు. ప్రపంచ శాంతి, అభివృద్ధిని ప్రోత్సహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నందుకు చైనాకు ధన్యవాదాలు తెలిపారు. పేదరికం తగ్గింపు, వాతావరణ మార్పుల ప్రతిస్పందన, జీవవైవిధ్య పరిరక్షణ,కోవిడ్‌19 వ్యాక్సిన్‌లను గ్లోబల్‌ పబ్లిక్‌ వస్తువులుగా ప్రచారం చేయడంలో చైనా కీలక పాత్ర పోషించినందుకు యుఎన్‌ ప్రశంసలను కూడా ఆయన తెలియజేశారు. పొరుగు దేశాల ప్రజల అభీష్టాన్ని గౌరవించాలని, రాజకీయ పరిష్కారాన్ని సూచించాలన్నారు. ప్రపంచంలో ఒకే వ్యవస్త, ఒకే ఆర్డర్‌, ఒకేనియమావళి ఉందని, అన్ని దేశాలు తమకు అనుకూలమైన వాటిని చేయకుండా ఒకే ఫ్రేమ్‌వర్క్‌లో పనిచేయాలని అన్నారు. ప్రధాన దేశాలు ఒకరినొకరు గౌరవించుకోవాలన్నారు. శాంతియుతంగా సహజీవనం చేయాలని అంతర్జాతీయ సమాజం ఉమ్మడి ప్రయోజనాలకు గాను విన్‌విన్‌ ప్రాతిపదికన పరస్పర ప్రయోజనం కోసం పనిచేయాలని జిన్‌పింగ్‌ సూచించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలపై కోవిడ్‌ మహామ్మరి తీవ్ర ప్రభావం చూపిందని ప్రపంచవ్యాప్తంగా వాక్సిన్‌ల పంపిణీ వేగవంతం చేయాలని జిన్‌పింగ్‌ కోరారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇబ్బందులను పరిష్కరించడానికి ి2030 సుస్థిర అభివృద్ధి అజెండా అమలులో సహాయం చేసేందుకు, సమతుల్య, సమన్వయ సమగ్ర ప్రపంచ అభివృద్ధిలో నూతన దశకోసం పనిచేసేందుకు చైనా యుఎన్‌తో సమన్వయాన్ని మెరుగుపరచేందుకు సిద్ధంగా ఉందన్నారు.
పారిస్‌ ఒప్పందాన్ని అమలు చేయాలని, ఉమ్మడి బాధ్యతలకు కట్టుబడి ఉండాలని, ఉద్గారాల తగ్గింపుకు సంబంధించి బాధ్యతలను అమలుచేయాలని జిన్‌పింగ్‌ కోరారు. బహుపాక్షికతకు కట్టుబడి ఉండాలని ప్రపంచ శాంతి, అభివృద్ధికి హృదయపూర్వకంగా సహకరించాలని సూచించారు. మానవాళికి భాగస్వామ్య భవిష్యత్తుతో కూడిన కమ్యూనిటీని ఏర్పరచడానికి, ఐక్యరాజ్యసమితి పతాకం క్రింద ఐక్యంగా అన్ని దేశాలతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉందని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img