Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఔకస్‌ కూటమిపై బ్రిటన్‌ యువత నిరసన

లండన్‌ : యుద్ధ వాతావరణాన్ని, సామ్రాజ్యవాదాన్ని సహించేది లేదని ఔకస్‌ కూటమికి వ్యతిరేకంగా నిరసనకు బ్రిటన్‌ యంగ్‌ కమ్యూనిస్టు లీగ్‌ (వైసీఎల్‌) పిలుపునిచ్చింది. ఔకస్‌ కూటమి (ఆస్ట్రేలియాయూకేయుఎస్‌) అణు ఒప్పంద ప్రకటనకు వైసీఎల్‌ల్‌ తీవ్రంగా ఖండిరచింది. అమెరికా, బ్రిటన్‌,ఆస్ట్రేలియాలు చైనాను లక్ష్యంగా ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆగ్నేయా సియాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రే లియా కోసం నూతన అణు జలాంతర్గాములను నిర్మా ణం చేస్తారు. ఈ ప్రచ్చన్న యుద్ధంలో చైనా శాంతి యుత అభివృద్ధి ప్రపంచంలోనే ప్రముఖ ఆర్థికశక్తిగా చైనా ఎదగడం అమెరికాకు ముప్పుగా పరిణమిస్తోంది. చైనాను అంతర్గతంగా రెచ్చగొట్టే ప్రయత్నాలను అమెరికా నిశ్చయించిందని వైసీఎల్‌ పేర్కొంది. ఔకస్‌ కూటమి అణు ఒప్పందం ప్రపంచ శ్రామికులకు, యువతకు మరింత ప్రమాదకరంగా పరిణమించనుందని వైసీఎల్‌ హెచ్చరించింది. ఇది ఆగ్నేయాసియాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా రెచ్చగొట్టే విధానాలకు ఈ కూటమి లక్ష్యంగా ఉంది. మరిన్ని అణుజలాంతర్గాములు ప్రపంచంలోని సముద్రాలను చుట్టుముట్టనున్నాయి. అమెరికా నేతృత్వం లోని సామ్రాజ్యవాదం ప్రపంచవ్యాప్తంగా తమ అధి పత్యాన్ని సోషలిస్టు దేశాలపై దాడులకు సిద్ధమవు తోందని వైసీఎల్‌ ఆగ్రహం వెలిబుచ్చింది. తమ సొంత జలాంతర్గాములను ఆస్ట్రేలియాకు విక్రయించాలని ఒడం బడికను కుదుర్చుకున్న ఫ్రాన్స్‌ సామ్రాజ్యవాద ద్రోహాన్ని తీవ్రంగా నిరసించింది. సామ్రాజ్యవాదానికి నిరసనగా బ్రిటన్‌ యువత ప్రపంచ యువతతో కలిసి జాత్య హంకార ధోరణులకు వ్యతిరేకంగా పోరాడాలని నిశ్చయించాయి. ఈ నేపధ్యంలో బ్రిటన్‌ యువ కమ్యూ నిస్టులు ఏకపక్ష అణు నిరాయుధీకరణు వ్యతిరేకించాయి. ప్రపంచవ్యాప్త సామ్రాజ్యవాదాన్ని నిరసించాయి. శాశ్వత శాంతికోసం బ్రిటన్‌ యంగ్‌ కమ్యూనిస్టులు పోరాటానికి పిలుపునిచ్చారు. బ్రిటన్‌ నుండి అమెరికా, నాటో బలగాల స్థావరాల తొలగింపునకు పిలుపునిచ్చారు.
ఔకస్‌ అణు అయుధపోటీని ప్రేరేపిస్తుందని ఉత్తర కొరియా పేర్కొంది. యుఎస్‌, యుకె,ఆస్ట్రేలియాల మధ్య నూతన భద్రతా ఒప్పందాన్ని ఉత్తరకొరియా ఖండిరచింది. అది అణ్వాయుధాల పోటీని ప్రేరేపి స్తుందని ఆగ్రహం వెలిబుచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img