Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

శాంతి, సుస్థిరత ప్రధాన వేదికగా సిలాక్‌

బీజింగ్‌ : లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ దేశాల 6వ శిఖరాగ్ర సమావేశం (సీలాక్‌) మెక్సికో నగరంలో వర్చు వల్‌గా జరిగింది. మెక్సికో ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నేతృత్వంలో ఈ సమావేశం జరి గింది. కరేబియన్‌ దేశాల స్వాతంత్య్రానికి, ఐక్యతకు సిలాక్‌ ఉద్భవించింది. ప్రాంతీయ సమైక్యత, సమగ్రత ప్రధాన లక్ష్యంగా సిలాక్‌ ఉద్భవించడం మైలురాయిగా జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారు. గత 10 సంవత్సరాల్లో సీలాక్‌ దేశాల్లో శాంతి, సుస్థిరతకు అభివృద్దిని ప్రోత్సహించడంలో ముఖ్యపాత్ర పోషించిందన్నారు.. సిలాక్‌తో సంబంధాల అభివృద్ధికి చైనా ప్రాముఖ్యతనిస్తుందన్నారు. సహకారం, సవాళ్లను ఎదుర్కోవ డానికి ప్రాంతీయ దేశాల సమన్వయంతో సీలాక్‌కు చైనా మద్ధతు ఇస్తుందని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. 2014లో చైనా, లాటిన్‌ అమెరికాల మధ్య సమగ్ర సహకారం, అభివృద్ధికి నూతన మార్గ అన్వేషణకు చైనా సిలాక్‌ ఏర్పాటును ప్రాంతీయ దేశాల నాయకులు, తాము సంయుక్తంగా ప్రకటించామని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. గత ఏడు సంవత్సరాలలో ఫోరమ్‌ అభి వృద్ధి చెందిందని చైనా, లాటిన్‌ అమెరికాలోని అన్ని వర్గాల నుండి స్నేహపూర్వక దళాలను ఒక చోట చేర్చే ప్రధాన వేదికగా చైనాలాటిన్‌ అమెరికా సంబంధాలలో సహకారాని సిలాక్‌ అభివృద్ధిచేసిందన్నారు. చైనాలాటిన్‌ అమెరికా దేశాల సంబం ధాలు సమానత్వం, పరస్పర ప్రయోజనం, నూతన ఆవిష్క రణలతోపాటు నూతన శకంలోవి ప్రవేశించాయని జిన్‌పింగ్‌ నొక్కిచెప్పారు. కోవిడ్‌ వ్యాప్తి నియంత్రణలో చైనా, లాటిన్‌ అమెరికా దేశాల మధ్య మహమ్మారికి వ్యతిరేకంగా అన్ని విధాల సహాకారాన్ని చేపట్టాయన్నారు. చైనా, లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ దేశాలకు తన మద్దతును, సహకారాన్ని అందిస్తూ ఉంది. ఈ దేశాల మధ్య భాగస్వామ్య భవిష్యత్తుకు సం యుక్తంగా అవకాశాలను సృష్టించడం ప్రధాన లక్ష్యంగా జిన్‌పింగ్‌ తన సందేశంలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img