Friday, April 26, 2024
Friday, April 26, 2024

కోస్టరికా భద్రతా నిధి ఏమైందో తేల్చండి

ఐఎల్‌ఓకు కార్మిక సంఘం వినతి
శాన్‌జోసె: కోస్టరికా భద్రతా నిధి ఏమైందో తేల్చాలని అంతర్జాతీయ కార్మిక సంఘం (ఐఎల్‌ఓ)కు యునైటెడ్‌ ట్రేడ్‌ యూనియన్‌ మూవ్‌మెంట్‌ విన్నవించింది. సామాజిక భద్రతకున్న పొంచివున్న ముప్పుల గురించి అధ్యయనం చేసేందుకు ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందాన్ని కోస్టరికాకు పంపాలని కోరింది. స్థానికుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం, వారి ఆందోళనను శాంతిపజేసేందుకు ఇది తక్షణవసరమని పేర్కొంది. కోస్టరికా సామాజిక భద్రతా నిధి (సీసీఎస్‌ఎస్‌) ఆరోగ్య బీమాపై స్వతంత్ర`వాస్తవాధారిత అంచనా ముఖ్యమని ఐఎల్‌ఓ సూచించింది. ప్రజారోగ్యం ప్రాథమిక హక్కుగా భావితరాలకు ఉండాలంటే విశ్వసనీయ అధ్యయనాలు చేపట్టాలని, అది ఐఎల్‌ఓకే సాధ్యమవుతుందని సంఘం పేర్కొంది. తమ విజ్ఞప్తిని అర్థం చేసుకొని సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడిరచింది. ఎలాంటి ఆధారాలు లేకుండా భద్రతానిధి దివాలాపై వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img