Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

చైనాతో 181 దేశాల దౌత్య సంబంధాలు

బీజింగ్‌ : చైనాతో మొత్తం 181 దేశాలు దౌత్య సంబంధాలు ఏర్పర్చుకున్నాయని, పదేళ్ల క్రితం 172 దేశాలు మాత్రమే దౌత్య సంబంధాలు కలిగి వున్నాయని విదేశాంగ శాఖ సహాయమంత్రి మా జావోక్సు గురువారం ఇక్కడ తెలిపారు. గత దశాబ్దకాలంగా చైనా దౌత్య సేవలను ఆయన కొనియాడారు.
చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ మహాసభల సందర్భంగా పాత్రికేయులతో మా మాట్లాడుతూ, ప్రపంచ వ్యాపితంగా చైనా భాగస్వామ్య దేశాలు, ప్రాంతీయ సంస్థల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని, దశాబ్ద కాలం 41 మాత్రమే ఉన్న ఈ సంఖ్య 113కి పెరిగిందని తెలిపారు. నూతన శకంలో సహకారానికి చైనారష్యా సమగ్ర భాగస్వామ్య నిర్మాణంలో దేశం ప్రగతి సాధించిందని మా వెల్లడిరచారు. చైనాఅమెరికా సంబంధాలకు పరస్పర గౌరవం, శాంతియుత సహజీవనం, పరస్పర సహకారం అనే మూడు సూత్రాలు ప్రతిపాదించినట్లు ఆయన చెప్పారు. శాంతి, పెరుగుదల, సంస్కరణ, నాగరికత కొరకు చైనా`ఇ.యు. భాగస్వామ్యాన్ని సిఫార్సు చేసినట్లు కూడా మా వెల్లడిరచారు. పొరుగు దేశాల మద్దతును కూడా చైనా సుసంఘటితం చేసింది. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో ఐక్యత, సన్నిహిత సహకారాన్ని చైనా పెంపొందించినట్లు మా పేర్కొన్నారు.
ఈ క్రమంలో జాతీయ సార్వభౌమత్వం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను శక్తివంతంగా కాపాడుకున్నట్లు ఆయన తెలిపారు. ఇంతకు ముందు తైవాన్‌ ప్రాంత దేశాలతో ‘దౌత్య సంబంధాలు’గా పిలువబడిన తొమ్మిది దేశాలతో చైనా ఇప్పుడు దౌత్య సంబంధాలు ఏర్పర్చుకొన్నట్లు కూడా మా వెల్లడిరచారు. ఒకే చైనా విధానానికి అంతర్జాతీయ మద్దతుకు చైనా దౌత్య ప్రయత్నాలు గత పదేళ్లలో సుసంఘటితమైనట్లు మా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img